Revenge: జిమ్ ట్రైనర్ హత్యకు అదే కారణం, మల్లి గ్యాంగ్ పక్కాస్కెచ్, క్లారిటీ ఇచ్చేసిన పోలీసులు !

బెంగళూరు: ఓ యువకుడు జిమ్ సెంటర్ లో ట్రైనర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. జిమ్ సెంటర్ కోచ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. కొందరు యువకులను వెంట వేసుకుని తిరుగుతున్న జిమ్ ట్రైనర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రతిరోజు ఉదయం జిమ్ సెంటర్ లో అమ్మాయిలు, మహిళలు, అబ్బాయిలకు శరీరం ఎలా తగ్గించుకోవాలి అంటూ శిక్షణ ఇస్తున్నాడు. అలాంటి జిమ్ ట్రైనర్ ను దారుణంగా వెంటాడి వెంటాడి నరికి చంపేయడం కలకలం రేపింది. జిమ్ సెంటర్ ట్రైనర్ ను ఎందుకు చంపేశారు అనే విషయంలో పోలీసు అధికారులు క్లారిటీ ఇచ్చారు. మల్లి గ్యాంగ్ పక్కా స్కెచ్ తో జిమ్ ట్రైనర్ ను చంపేశారని పోలీసు అధికారులు క్లారిటీ ఇచ్చారు.

కర్ణాటకలోని దావణగెరెలో నగరంలో ధన్యకుమార్ అలియాస్ ధన్య అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కండలు తిరిగిన శరీరం పెంచిన ధన్య కుమార్ దావణగెరె నగరంలోని స్టైల్ జిమ్ సెంటర్ లో జిమ్ సెంటర్ లో ట్రైనర్ గా పని చేస్తున్నాడు. దావణగెరె సిటీలో ధన్య కుమార్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రతిరోజు యువకులను వెంట వేసుకుని తిరుగుతున్న జిమ్ ట్రైనర్ ధన్య కుమార్ అతని కండలు చూపిస్తూ అందరిని ఆకర్షిస్తున్నాడు. ఈ బిల్డప్ తన ప్రాణం తీస్తుందని జిమ్ ట్రైనర్ ధన్యకుమార్ ఊహించలేకపోయాడు.

 Three people arrested for gym trainer murder case in Davanagere in Karnataka.

బుధవారం రాత్రి దావణగెరె నగరం శివార్లలోని ఫామ్ హౌస్ లో స్నేహితుడి పెళ్లి సందర్బంగా ఏర్పాటు చేసిన డిన్నర్ కు ధన్య కుమార్ వెళ్లాడు. అర్దరాత్రి వరకు లిక్కర్ పార్టీతో పాటు మాంసాహార వంటలు తింటూ అందరూ ఎంజాయ్ చేశారు. రాత్రి 1. 30 గంటల సమయంలో ప్రత్యర్థులు ఒక్కసారిగా ధన్య కుమార్ మీద విరుచుకుపడ్డారు.

ప్రత్యర్థులు వేట కొడవళ్లు, కత్తులతో దాడి చెయ్యడంతో ధన్య కుమార్ హడలిపోయాడు, ధన్య కుమార్ తో పాటు అతని స్నేహితులు దిక్కుతోచకపరుగు తీశారు. ఫామ్ హౌస్ నుంచి బయటపడిన ధన్య కుమార్ పొలాల్లో పరుగు తీసి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే ప్రత్యర్థులు వెంటాడి వెంటాడని ధన్య కుమార్ ను అతి కిరాతకంగా నరికి చంపేశారు. ధన్యకుమార్ హత్య కేసులో కేటీజీ నగర్ నివాసి రవి (24), మల్లిఖార్జున్ అలియాస్ మల్లి (25), సుదీప్ అలియాస్ సుది (22) అనే ముగ్గురిని అరెస్టు చేశామని సోమవారం పోలీసులు చెప్పారు.

మల్లి అలియాస్ మల్లిఖార్జున్ వర్గానికి, అతని ప్రత్యర్థి వర్గానికి గొడవలు ఉన్నాయని, మల్లి ప్రత్యర్థి వర్గంలో ధన్యకుమార్ గుర్తింపు తెచ్చుకున్నాడని, మాకు పోటీ వస్తాడని ధన్యకుమార్ ను అతని ప్రత్యర్థి వర్గం పక్కా స్కెచ్ తో చంపేశారని పోలీసు అధికారులు తెలిపారు. ధన్యకుమార్ హత్యకు రెండు వర్గాల కోల్డ్ వార్ కారణ: అని దావణగెరెకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+