రేప్ కేసు, టీవీ చానల్స్ లో ప్రసారం చేస్తాం రూ. 70 లక్షలు, బ్లాక్ మెయిల్, పూజారి పరువు !

బెంగళూరు: సమస్యలు పరిష్కరించడానికి ఇంటిలో పూజలు చేసి వెళ్లిన పూజారిని తరువాత మీ మీద రేప్ కేసు పెడుతామని, టీవీ చానల్స్ లో ప్రసారం చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు మహిళలు అతని నుంచి రూ. 20 లక్షలు లూటీ చేసి మరో రూ. 50 లక్షలు లాక్కోవడానికి ప్రయత్నించిన ఘటన కర్ణాటకలో జరిగింది. అవమానం జరిగి ఎక్కడ తన కటుంబం పరువు పోతుందో అని ఆందోళన చెందిన ఆ పూజారి రూ. 20 లక్షలు ఇచ్చాడు. పూజారిని మళ్లీ బ్లాక్ మెయిల్ చేసి మరో రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆ మహిళలు డిమాండ్ చేశారు. ఇక లాభం లేదని పూజారి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ముగ్గురు కిలాడీలను అరెస్టు చేశారు.

ఆంజనేయస్వామి గుడి

ఆంజనేయస్వామి గుడి

కోళ్ళాగాలలో ప్రసిద్ది చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో రాఘవన్ ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్నారు. ప్రధాన అర్చకుడు రాఘవన్ భక్తుల కోరిక మేరకు వాళ్లకు మంచి జరగాలని వారి ఊరికి వెళ్లి ఆయనే స్వయంగా ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేస్తుంటారు.

బెంగళూరు మహిళలు

బెంగళూరు మహిళలు

బెంగళూరు నగరంలోని హెసరుగట్టకు చెందిన సరోజమ్మ ఆరు నెలల క్రితం కోళ్ళాగాలలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం దగ్గరకు వెళ్లి అక్కడ పూజలు చేసింది. తరువాత తనకు అనేక సమస్యలు ఉన్నాయని, బెంగళూరులోని మా ఇంటికి వచ్చి పూజలు చేసి మా సమస్యలు తీర్చాలని సరోజమ్మ పూజారి రాఘవన్ కు మనవి చేసింది.

ఫోన్ చేసిన మహిళ !

ఫోన్ చేసిన మహిళ !

నెల క్రితం బెంగళూరు చేరుకున్న పూజారి రాఘవన్ హెసరుఘట్టలోని సరోజమ్మ ఇంటిలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత సరోజమ్మ వారి బంధువులు నాగరత్నమ్మ, బసవరాజు తదితరులను పూజారి రాఘవన్ కు పరిచయం చేసింది. మా ఇంటిలో కూడా పూజలు చేసి మాకు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని పూజారి రాఘవన్ కు నాగరత్నమ్మ మనవి చేసింది.

రేప్ కేసుతో నీ పని క్లోజ్ !

రేప్ కేసుతో నీ పని క్లోజ్ !

15 రోజుల తరువాత పూజారి రాఘవన్ కు ఫోన్ చేసిన సరోజమ్మ, నాగరత్న మాకు రూ. 20 లక్షలు ఇవ్వాలని, లేదంటే మా ఇద్దరినీ రేప్ చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని , టీవీ చానల్స్ ను పిలిచి వారి దగ్గర మాకు అన్యాయం జరిగిందని చెబుతామని బెదిరించారు. కేసు పెట్టి మీమ్మల్ని జైలుకుం పంపిస్తామని పూజారి రాఘవన్ ను బ్లాక్ మెయిల్ చేశారు. తరువాత మీరు ఎక్కడా, ఎవరి ఇంటిలో పూజలు చెయ్యడానికి అవకాశం ఉండదని, మీకు వస్తున్న ఆదాయం మొత్తం పోతుందని, మీ కథ క్లోజ్ అని సరోజమ్మ, నాగరత్న పూజారి రాఘవన్ ను బెదిరించారు.

రూ. 20 లక్షలు లూటి

రూ. 20 లక్షలు లూటి

భక్తుల దగ్గర తనకు ఎంతో పేరు ఉందని, రేప్ కేసు పెడితే జీవితం మొత్తం నాశనం అవుతోందని భయంతో పూజారి రాఘవన్ సరోజమ్మ, నాగరత్న చెప్పినట్లు వారికి ఇప్పటి వరకు రూ. 20 లక్షలు ఇచ్చాడు. రూ. 20 లక్షలు తీసుకున్న సరోజమ్మ, నాగరత్నమ్మ కొంత కాలం గడిపేశారు.

ఫ్రీగా వస్తోందని దురాశతో !

ఫ్రీగా వస్తోందని దురాశతో !

రూ. 20 లక్షలు ఇచ్చిన పూజారి దగ్గర మరో రూ. 50 లక్షలు లాక్కోవాలని నాగరత్నమ్మ, సరోజమ్మకు దురాశ పుట్టింది. పూజారి రాఘవన్ కు ఫోన్ చేసిన నాగరత్నమ్మ, సరోజమ్మ మాకు మరో రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేదంటే టీవీ చానల్స్, మీడియాకు చెబుతామని బెదిరించారు. ఆందోళన చెందిన పూజారి రాఘవన్ నాగరత్నమ్మ, సరోజమ్మ ఫోన్ చేసిన సమయంలో మొబైల్ లో రికార్డు చేసి పోలీసులకు ఇచ్చారు.

Recommended Video

    Sarah Taylor bares it all on Instagram, reveals the reason for posting her image
    పూజారి మాస్టర్ ప్లాన్

    పూజారి మాస్టర్ ప్లాన్

    పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. డబ్బులు ఇస్తానని పూజారి రాఘవన్ దగ్గర మహిళలకు ఫోన్ చేయించారు. డబ్బులు తీసుకురావడానికి కోళ్ళాగాల సమీపంలోకి వెళ్లిన సరోజమ్మ, నాగరత్నమ్మ, బసవరాజును పోలీసులు అరెస్టు చేశారు. పూజారి రాఘవన్ దగ్గర లాక్కోన్న రూ. 20 లక్షల్లో రూ. 13. 77 లక్షలు స్వాధీనం చేసుకుని వీరు ఇంకా ఎంత మందిని ఇలా బ్లాక్ మెయిల్ చేశారు అని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+