పహల్గామ్ ఉగ్రవాదులు ఖతం.. పగ తీర్చుకున్న భారత్..!
జమ్మూ కశ్మీర్ లో భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది. శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఈ దాడుల్లో కనీసం ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టారు. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులుగా తెలుస్తోంది. కానీ చినార్ కోర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
#BREAKING: Three Pakistan sponsored terrorists killed in the Dachigam encounter in Srinagar, Jammu & Kashmir by Indian Army, J&K Police. High probability that terrorists killed were linked with the brutal Pahalgam terror attack in which 26 innocents were killed. #OperationMahadev
— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 28, 2025
జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టి హతమార్చాయి. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, CRPF సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ కాల్పుల్లో మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తయిబాకు చెందిన వారని సమాచారం.

జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ ఆ సమయంలో అధికారికంగా వెల్లడించింది.












Click it and Unblock the Notifications