ఆ యూనివర్శిటిలో 3 వేల కండోమ్ లు దొరికాయి

న్యూడిల్లీ :డిల్లీలోని జెఎన్ యూ యూనివర్శిటీ ఆవరణలో 3 వేల కండోమ్ లు దొరికాయా,... కండో మ్ లతో పాటు మహిళలు అబార్షన్ల కోసం ఉపయోగించిన ఇంజక్షన్లు దొరికాయా ..యూనివర్శిటీ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకొంటాయా ఆశ్చర్య పోతున్నారా...ఈ యూనివర్శిటీలో ఏం జరుగుతోందోననే చర్చ సర్వత్రా కొనసాగుతోంది.

న్యూడిల్లీలోని జెఎన్ యూ లో విధ్యార్థి సంఘం నేతగా కన్నయ్య కుమార్ ఉన్నంలో జరిగిన నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమం ద్వారానే కన్హయ్య కుమార్ పేరు ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సందర్భంగానే జెఎన్ యూలో అసాంఘిక ాకర్యక్రమాలు చోటుచేసుకొంటున్నాయని బిజెఫి ప్రజా ప్రతినిధి ఒకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

three thousand condoms found an university

జెఎన్ యూలో రోజుకు 3 వేల బీరు బాటిళ్ళు, 2 వేల మద్యం సీసాలు,10 వలే సిగరెట్టు, 4 వేల బీడీలు, 50 వేల లెగ్ పీసులు, 2 వేల చిప్స్ ప్యాకెట్ల తో పాటు 3 వేల కండోమ్ లు 500 అబార్షన్ కు ఉపయోగించే ఇంజక్షన్లను వాడుతారని బిజెపి ఎంఏల్ ఏ జ్హన్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను జెఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మరోసారి ప్రస్తావించారు.

అక్టోబర్ 14న, వర్శిటీ హస్టల్ లో జరిగిన గొడవ తర్వాత నజీబ్ అహ్హాద్ అదృశ్యమయ్యాడని ఆయన చెప్పారు. యూనివర్శిటీలో 3 వేల కండోమ్ లు, 500చ అబార్షన్ కు ఉపయోగించే ఇంజక్షన్లను కనుగొన్న అధికారులు అదృశ్యమైన విధ్యార్థి ఆచూకీని ఎందుకు కనుగోలేదని ఆయన ప్రశ్నించారు.

బీహర్ రాష్ట్రానికి చెందిన కన్హయ్య జెఎన్ యూ లో విద్యార్థి సంఘం నేత ఎన్నికైన తర్వాత నిర్వహించిన కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. అయితే ఈ కేసులో కన్హయ్య కుమార్ అరెస్టై తీహార్ జైలులో శిక్షను అనుభవించాడు.ఇటీవలే ఆయన ప్రమ్ బీహార్ టూ తీహార్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా కన్హయ్య కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి నాయకుల తీరును ఎండగట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+