అసభ్య ప్రవర్తన: కదులుతున్న వాహనం నుంచి దూకిన మహిళలు

లక్నో: తమ పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ముగ్గురు మహిళలు కదులుతున్న వాహనంలో నుంచి దూకేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ సమీపంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బాగ్రా గ్రామంలో ముగ్గురు మహిళలు లిఫ్ట్ అడిగి వాహనంలోకి ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. వాహనం ఆపమని ఎంత అడిగినా ఆపకుండా వెళ్తుండటంతో కంగారుపడిన మహిళలు కదులుతున్న వాహనంలో నుంచి బయటకు దూకేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.

Three women jump off moving vehicle to resist eve-teasing

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. గాయాలపాలైన ముగ్గురు మహిళలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్ బాలికపై రేప్: దోషికి పదేళ్ల జైలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతోపాటు రూ. 30వేల జరిమానా విధించింది. 2013లో చిని అనే వ్యక్తి స్థానిక కురోయిలీ బ్లాక్‌లోని పొలాలకు వెళ్లిన ఓ మైనర్‌పై అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి బంధువులు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసు తీర్పు ఇప్పుడు వెలువడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+