క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడి ఆరుగురు మృత్యువాత
ఒరిస్సా: క్రికెట్ మైదానంలో పిడుగుపడి ఆరుగురు మృత్యువాత పడిన ఘటన ఒడిశాలోని కుర్దా జిల్లాలోని జరిపాద గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, గ్రామంలోని యవకులు రెండు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడుకుంటుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వర్షం పడింది.
దీంతో యువకులు సమీపంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లి తలదాచుకున్నారు. అదే సమయంలో యువకులు ఉన్న ఇంటిపై పిడుగు పడింది. ఒక్కసారిగా పడిన పిడుగుతో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని కుర్దాలోని తంగి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ తరలించారు. వీరిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది. ఇది ఇలా ఉంటే ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications