Lady: రైలులో ఏసీ బోగిలో మహిళ మీద ఫ్రెండ్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన టికెట్ ఇన్స్ పెక్టర్, కూల్ డ్రింక్ లో!
లక్నో/ఉత్తరప్రదేశ్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి వేలల్లో జీతం తీసుకుంటూ లగ్జరీ లైఫ్ గడుపుతూ ఎక్కువ కొవ్వపట్టినట్లు ఉంది. ఒంటరిగా రైలులో ప్రయాణిస్తున్న వివాహిత మహిళకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన రైల్వే ఉద్యోగి మరో స్నేహితుడితో కలిసి ఆమె మీద గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్‌లోని సంబల్‌కు చెందిన 30 ఏళ్ల మహిళ జనవరి 16న డెహ్రాడూన్-ప్రయాగ్‌రాజ్ లింక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆమె రెండు సంవత్సరాల కొడుకుతో కలిసి ప్రయాణించింది. ఆమె పబ్లిక్ కోచ్‌లో ప్రయాణిస్తుండగా, ఈ మహిళకు తెలిసిన టికెట్ ఇన్‌స్పెక్టర్ రాజు సింగ్ ఆ రైలులో విధులు నిర్వహిస్తున్నాడు. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో పిల్లలతో ప్రయాణించడం కష్టమని టికెట్ ఇన్‌స్పెక్టర్ మహిళకు ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో సీటు ఏర్పాటు చేశారు.
మహిళ ఏసీ కోచ్‌లో ప్రయాణం కొనసాగించింది. టికెట్ ఇన్‌స్పెక్టర్ రాజు సింగ్ రాత్రి పది గంటలకు ఆమెకు కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చి తాగమని చెప్పాడు. మహిళ కూల్ డ్రింక్ తాగేసింది. అప్పటికే కూల్ డ్రింక్ లో టికెట్ ఇన్స్ పెక్టర్ రాజు సింగ్ మత్తు మందు కలిపడంతో అది తాగిన మహిళ అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తర్వాత టికెట్ ఇన్‌స్పెక్టర్ రాజు సింగ్ మరో వ్యక్తితో కలిసి రైలులోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లో వివాహిత మహిళపై సామూహిక అత్యాచారం చేశారు.

తరువాత మెలుకవ వచ్చిన మహిళకు అసలు విషయం తెలిసింది. సామూహిక అత్యాచారం జరిగే సమయంలో తాను అపస్మారక స్థితిలో ఉండడంతో ఏమీ చేయలేక, కేకలు కూడా వెయ్యలేకపోయింది. స్పృహలోకి రాగానే జరిగిన దారుణం గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా టికెట్ ఇన్‌స్పెక్టర్ రాజు సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంతలో ఆ మహిళ అవతలి వ్యక్తిని గుర్తించలేకపోయింది. ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సత్భావన ఎక్స్‌ప్రెస్ రైలులో 27 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించినందుకు రైల్వే ఉద్యోగిని అరెస్టు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మరో రైలులో మరో మహిళ మీద లైంగికదాడి జరగడం కలకలం రేపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications