టీమ్ లీడర్ ను 58 సార్లు కత్తులతో పొడిచి చంపేశారు. బిగ్ బాస్ లో టైగర్ డ్యాన్స్ తో ఫేమస్ అయ్యారు !
బెంగళూరు/మంగళూరు: పులి వేషధారణలో దక్షిణ కన్నడ జిల్లాలో చాలా ప్రసిద్ధ బృందం ఒకటి ఉంది. ఈ టీమ్ కన్నడ బిగ్ బాస్ లో కూడా మంచి ప్రదర్శన చేసి కర్ణాటక వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ టైగర్ టీమ్‌కి లీడర్‌గా అక్షయ్ కల్లె కూడా చాలా ఫేమస్ అయ్యాడు. టీమ్ కట్టుకుని అక్షయ్ రంగంలోకి దిగితే బహుమతి, అవార్డు గ్యారెంటీ అని పేరు తెచ్చుకున్నాడు.
అలాంటి పులి వేషదారణ టీమ్ లీడర్ అక్షయ్ దారుణ హత్యకు గురయ్యాడు. హంతకులు 58 సార్లు కత్తితో పొడిచి టైగర్ అక్షయ్ ని దారుణంగా చంపేశారు. టైగర్స్ టీమ్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న అక్షయ్ చిన్న విషయానికి బలి అయ్యాడని వెలుగు చూడటంతో అందరూ హడలిపోయారు. అక్షయ్ ని అతనితో ఇంతకాలం ఉన్నవారే హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

అక్షయ్ కొంత మందిని గ్రూప్ గా చేసుకుని టైగర్ డ్యాన్స్ టీమ్ గా పేరు పెట్టి దక్షిణ కన్నడ జిల్లాతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో ప్రొగ్రామ్స్ నిర్వహించ మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి అక్షయ్ ని కొందరు దారుణంగా నరికి, కత్తులో పొడిచి చంపారు. మొదట అక్షయ్ హత్య కేసులో పోలీలకు నఅేక అనుమానాలు వచ్చాయి. చివరికి అక్షయ్‌ని అతనితో పాటు ఉన్న వాళ్లే చంపేశారని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది..
నలుగురు వ్యక్తులు పులి డ్యాన్స్ గ్రూప్ లీడర్ అక్షయ్ ని 58 సార్లు కత్తులతో పొడిచి కత్తులతో నరికి చంపేశారని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. అక్షయ్ ని ఇంత దారుణంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అని పోలీసులు ఆరా తీశారు. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగిపోయే వివరాు బయటకు వచ్చాయి. కేవలం రూ 2, 000 కోసం అక్షయ్ ని చంపేశారని వెలుగు చూడటంతో అందరూ హడలిపోయారు.

అక్షయ్ హత్యకు గురైన రోజు సాయంత్రం అక్షయ్ బైక్ ను ఎత్తుకుని వెళ్లిన అతని స్నేహితుడు చేతన్ బైక్ ను రోడ్డు యాక్సిడెంట్ చేశాడు. ఆ సందర్బంలో అక్షయ్ బైక్ దెబ్బతినింది. ఈ విషయం అక్షయ్‌కి తెలిసి చేతన్‌కి రూ 2,000 నష్టపరిహారం చెల్లించమని చెప్పాడు. కానీ చేతన్‌కి ఇది కరెక్ట్ కాదు, నేను నీ ఫ్రెండ్ ని, నీ బైక్ నువ్వే రిపేర్ చేయించుకో అని చెప్పాడు.
తరువాత అక్షయ్, చేతన్ లకు గొడవ జరిగిందని తెలిసింది. ఈ విషయానికే అక్షయ్ ని మేము హత్య చేశామని చేతన్ తో పాటు అతని స్నేహితులు అంటున్నారు. అయితే ఈ రెండు వేల సినిమా కథలు వినడానికి పోలీసులు సిద్ధంగా లేరని తెలిసింది. అక్షయ్ హత్యకు మరేదైనా కారణం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications