టిక్‌టాక్ వీడియో చేస్తూ హాస్పిటల్ పాలైన కొరియోగ్రాఫర్

తుమకూరు : షార్ట్ వీడియో యాప్‌ టిక్‌టాక్‌కు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అదే రేంజ్‌లో ప్రమాదాలకు కారణమవుతోంది. కాపురాల్లో చిచ్చు పెట్టడమేకాక.. ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ యాప్‌లో పాపులారిటీ కోసం యూత్ వేస్తున్న పిచ్చి వేషాలు ఎన్నో. అలాంటి అడ్వెంచర్ చేయబోయిన ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. తాను చేసిన సాహసానికి హాస్పిటల్ పాలయ్యాడు.

తుమకూరు జిల్లా చిక్క నాయకనహళ్లి తాలూకా గూడకెరె గ్రామానికిచెందిన కుమార్ కొరియాగ్రాఫర్. టిక్‌టాక్ యూజర్ అయిన అతను అందులో తరుచూ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. పాపులారీటీ కోసం అనేక సాహసాలకు సిద్ధమవుతుంటాడు. ఇందులో భాగంగానే సోమవారం కుమార్ పల్టీ కొట్టే సాహసం చేశాడు.

Tik Tok act goes worng Youth sustains serious fracture

కుమార్ తన స్నేహితుడి సాయంతో బ్యాక్ జంప్ చేసే ప్రయత్నం చేసి బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో తల బలంగా నేలకు తాకి బరువంతా మెడపై పడింది. మెడ భాగంలో వెన్నెముక విరిగిపోవడంతో స్నేహితులు అతన్ని వెంటనే బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌కు తరలించారు. కుమార్‌ను పరీక్షించిన డాక్టర్లు సర్జరీ స్పైనల్ కార్డ్ విరిగి నట్లు గుర్తించారు. తక్షణమే సర్జరీ చేయాలని చెప్పారు.

కుమార్ సర్జరీ కోసం దాదాపు 10లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. శస్త్ర చికిత్స అనంతరం అతను మెడ తిరిగి యధాతథ స్థితికి వచ్చినా భవిష్యత్తులో అతను నడవడం అసాధ్యమని చెబుతున్నారు. పేద కుటుంబానికి చెందిన కుమార్‌కు చికిత్స ఎలా చేయించాలో తెలియక అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+