భారత్‌లో టిక్‌టాక్ దుకాణం ఎత్తేసినట్లేనా?: భారతీయ ఉద్యోగులందరిపై వేటు
భారతదేశంలో నిషేధానికి గురైన చైనా సోషల్ మీడియా టిక్‌టాక్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో తన మొత్తం కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు, భారతీయ ఉద్యోగులందర్నీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: జాతీయ భద్రత కారణాలతో 2020లో భారతదేశంలో నిషేధానికి గురైన చైనా సోషల్ మీడియా టిక్‌టాక్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో తన మొత్తం కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు, భారతీయ ఉద్యోగులందర్నీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా వేటువేసింది.

భారతీయ ఉద్యోగులకు టిక్‌టాక్ పింక్ స్లిప్స్
భారతదేశంలో టిక్‌టాక్ నిషేధానికి గురైన మూడేళ్ల తర్వాత దాని మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ వారం తర్వాత 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చేసింది టిక్‌టాక్. అయితే, తొమ్మిది నెలల జీతాలను ముందుగానే ఇచ్చి ఉద్యోగాలను నుంచి తొలగిస్తోంది. ఫిబ్రవరి 28 భారతదేశంలోని తమ ఉద్యోగులకు చివరి పని దినమని టిక్‌టాక్ స్పష్టం చేసింది. భారత్ లో నిషేధం ఉన్నందున వేరే సంస్థల్లో ఉద్యోగాలు చూసుకోవాలని ఇప్పటికే ఉద్యోగులకు చెప్పేసింది. ఇక ఇండియాలో తమ కార్యకలాపాలు కొనసాగవని పేర్కొంది.

భారత్‌లో టిక్‌టాక్ హబ్ మూసివేత
భారత్ కార్యాలయం కేంద్రంగా పలువురు ఉద్యోగులు బ్రెజిల్, దుబాయ్ మార్కట్ల కోసం పనిచేస్తున్నారు. ఇక భారత్‌లో తిరిగి కార్యకలాపాలు సాగించేందుకు టిక్‌టాక్ ప్రయత్నాలు ఫలించకపోగా అమెరికాలోనూ యాప్ భవితవ్యంపై సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో తమ గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్‌కు సపోర్ట్ కోసం 2020లో భారత్‌లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్ట్ హబ్‌ను మూసివేయాలని నిర్ణయించామని టిక్‌టాక్ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారత్ తోపాటు అమెరికాలోనూ టిక్‌టాక్‌కు షాక్
కాగా, టిక్‌టాక్‌కు భారత్ పెద్ద మార్కెట్. 2020లో టిక్‌టాక్‌పై నిషేధం విధించే సమయానికి ఇక్కడ సుమారు 200 మిలియన్లకుపైగా యూజర్లు ఉన్నారు. మరోవైపు, అమెరికాలోనూ టిక్‌టాక్ నిషేధాన్ని ఎదుర్కొంటోంది. భద్రత ప్రమాణాల కారణంగానే అమెరికా జో బైడెన్ ప్రభుత్వం టిక్‌టాక్‌పై వేస్తోంది. ఇటీవల కాలంలో చైనాకు, అమెరికాకు చాలా విషయాల్లో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
బైట్‌డాన్స్ అమెరికా యూజర్ డేటాను పదేపదే యాక్సెస్ చేసిందనే ఆరోపణలుండటంతో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ డిసెంబర్‌లో ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన పరికరాలపై టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఆమోదించారు.












Click it and Unblock the Notifications