టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ ఓటమి.. ఎందుకు ఓడిపోయానంటే కారణం చెప్పిన భామ..

హర్యానా అసెంబ్లీలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ బోటాబోటి సీట్లతో నువ్వా నేనా అన్నట్టు సీట్లు సాధించాయి. దీంతో ఇక్కడ హంగ్ తప్పదేమో అన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏడుగురు మంత్రులు ఓడిపోవడం బీజేపీని షాక్‌నకు గురిచేసింది. మరోవైపు టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ కూడా ఓటమి పాలయ్యారు. తన ఓటమికి గల కారణాలను ఆమె మీడియాకు వివరించారు.

టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ ఆధమ్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆమె విజయం నల్లేరు మీద నడకేనని భావించారు. కానీ అంచనాలు మాత్రం తలకిందులయ్యాయి. సోనాలి పోగట్ ఓడిపోయారు. 5, 10 వేల ఓట్లతో కాక ఏకంగా 29 వేల పైచిలుకు ఓట్లతో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ బిష్ణోయ్ 29 వేల 471 ఓట్లతో విజయం సాధించారు.

tiktok star Sonali Phogat defeated by congress

తన ఓటమికి గల కారణాలను సోనాలి ఫోగట్ వివరించారు. తనకు ఆధమ్‌పూర్ నియోజకవర్గం కేటాయించడంతోనే ప్రచార బరిలోకి దిగానని తెలిపారు. కానీ తనకు ఆశించిన సమయం మాత్రం దొరకలేదని పేర్కొన్నారు. దీంతో తాను నియోజకవర్గ ప్రజలను కలువలేకపోయానని చెప్పారు. మరింత సమయం లభిస్తే ఫలితం మరొలా ఉండేదని అభిప్రాయపడ్డారు. కానీ తాము ప్రజలతో మమేకమే పనిచేస్తామని భరోసానిచ్చారు. ఇప్పటికే ప్రజల కష్ట నష్టాలను తెలుసుకున్నామని.. వచ్చే ఎన్నికల్లో మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. దీంతో తమ పార్టీ విజయం సాధించేందుకు దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+