TikTok: ఫ్రీగా చిక్కిందని పిల్లి హత్య, ఉరి వేసి టిక్ టాక్ వీడియో, హీరో కావాలని, దూలతీరింది !

చెన్నై/ మదరై: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు అల్లాడిపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఏం చెయ్యాలో దిక్కుతోచక చాలా మంది సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నాడు. అయితే ఓ ఇంటర్ విద్యార్థి టిక్ టాక్ పిచ్చితో ఏం చెయ్యాలో దిక్కుతోచక ఓ పిల్లిని హత్య చేశాడు. అనంతరం ఆ పిల్లి మెడకు ఉరి వేసి వేలాడదీసి టిక్ టాక్ వీడియో తీశాడు. తన వీడియో వైరల్ అవుతుందని, తాను సెలబ్రిటీ అయిపోతానని ఊహల్లో తేలిపోయిన ఆ యువకుడి తిక్కకుదిరి నేడు శ్రీకృష్ణుడి జన్మస్థానంలో ఉన్నాడు.

 ఇంటర్ కే అతి తెలివి

ఇంటర్ కే అతి తెలివి

తమిళనాడులోని నెల్ లై జిల్లా పనడుడి సమీపంలోని శెట్టికులం సత్యనగర్ లో తంగరాజ్ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తంగరాజ్ ఫ్లస్ టూ (ఇంటర్) వరకు చదివాడు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ అమలుకావడంతో విద్యాసంస్థలు మూసివేయడంతో తంగరాజ్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంటర్ చదివిన తంగరాజ్ కు అతి తెలివి ఎక్కువ.

 టిక్ టాక్ పిచ్చి

టిక్ టాక్ పిచ్చి

ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి ఇప్పుడు టిక్ టాక్ పిచ్చిపట్టుకుంది. స్మార్ట్ మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు టిక్ టాక్ వీడియోలు చెయ్యాలని ఉబలాటపడిపోతున్నారు. కాలేజ్ లో స్నేహితులతో కలిసి టిక్ టాక్ వీడియోలు తీసిన తంగరాజ్ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా స్నేహితులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో ఎదైనా కొత్తగా టిక్ టాక్ వీడియో తియ్యాలని నిర్ణయించాడు.

ఫ్రీగా చిక్కిందని పిల్లి హత్య

ఫ్రీగా చిక్కిందని పిల్లి హత్య

ఇంటి దగ్గర ఖాళీగా తిరుగుతున్న తంగరాజ్ కు ఓ పిల్లి కనపడింది. అంతే పిల్లిని మచ్చిక చేసుకున్న తంగరాజ్ దానిని పట్టుకుని చంపేశాడు. తరువాత ఓ నైలాన్ తాడు తీసుకుని దాని మెడకు ఉరి వేసి వేలాడదీశాడు. పిల్లిని చంపి దానికి ఉరివేసి వేలాడదీసిన తంగరాజ్ టిక్ టాక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Recommended Video

    #IndiansAgainstTikTok : TikTok Rating Drops In Google Play Store
     ఏదో అనుకుంటే ఇలా జరిగింది

    ఏదో అనుకుంటే ఇలా జరిగింది

    పిల్లిని చంపి దానికి ఉరివేసి టిక్ టాక్ వీడియో తీశాడని తెలుసుకున్న అనేక మంది నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిక్ టాక్ వీడియో ఆధారంగా విచారణ చేసిన పోలీసులు, అటవి శాఖ అధికారులు తంగరాజ్ ను పట్టుకుని బెండ్ తీసి కేసు నమోదు చేశారు. టిక్ టాక్ వీడియోతో సెలబ్రిటీ అయిపోతానని ఊహల్లో విహరించిన తంగరాజు ప్రస్తుతం శ్రీకృష్ణుడి జన్మస్థానంలో (జైలు) ఊచలు లెక్కపెడుతున్నాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+