రేపే ఉరి: మెమన్ కేసులో ఎప్పుడేం జరిగింది?

ముంబై: తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి యాకుబ్ మెమన్ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ బుధవారం కొట్టేసింది. దీంతో రేపు (జులై 30) గురువాడం మహారాష్ట్రలోని నాగపూర్ జైల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది.

గురువారం ఉదయం 7 గంటల్లోగా అతడిని మహారాష్ట్రలోని నాగ్ పూర్ జైల్లో ఉరి తీయనున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోగా ఏ సమయంలోనైనా ఈ శిక్షను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. టాడా కోర్టు జారీచేసిన డెత్ వారంట్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది.

దీంతో ఆ వారెంట్ చెల్లుబాటు అవుతుందని జైలు వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రపతి గతంలో క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత, దాన్ని 14 రోజుల్లోగా కోర్టులో సవాలు చేయాల్సి ఉండగా మెమన్ అలా చేయలేదని సుప్రీం త్రిసభ్య బెంచ్ బుధవారం తెలిపింది.

ప్రస్తుతం యాకుబ్ మెమన్ నాగపూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. రేపు (జులై 30)న అక్కడే ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఇదే గనుక జరిగితే, 257 మంది ప్రాణాలను బలిగొన్న ముంబై వరుస పేలుళ్ల కేసులో తొలి ఉరి యాకుబ్ మెమన్‌దే. యాకుబ్ మెమన్ ఉరిశిక్ష నేపథ్యంలో నాగపూర్ జైలు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

జైలు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. జైలు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక దళాలను మహారాష్ట్ర ప్రభుత్వం మొహరించింది. ముంబైలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్, డీజీపీ సమీక్ష నిర్వహించారు.

Timeline: 1993 Mumbai blasts and after

1993 ముంబై వరుస పేలుళ్ల సంఘటనకు సంబంధించిన టైమ్‌లైన్:
1993 మార్చి 12: నిమిషాల వ్యవధిలోనే ముంబైలో 13 వరుస పేలుళ్లు. 257 మంది మృతి.
1993 నవంబర్ 4: 189 మంది నిందితులపై దాదాపు 10వేల పేజీల చార్జిషీటు దాఖలు.
1995 ఏప్రిల్ 10: 26మంది నిందితులను విడుదల చేసిన టాడా కోర్టు
2001 జూలై18: 684మంది సాక్షుల స్టేట్‌మెంట్ల రికార్డు పూర్తి
2003 సెప్టెంబర్: పూర్తయిన విచారణ.. రిజర్వులో తీర్పు
2006 సెప్టెంబర్‌ 12: తీర్పును వెల్లడించిన ముంబైలోని టాడా కోర్టు. 12 మందికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవ ఖైదు ఖరారు.
2013 మార్చి 21: యాకూబ్‌ మెమన్‌, టైగర్‌ మెమన్‌ల ఉరిశిక్షలను ధ్రువీకరించిన సుప్రీంకోర్టు. పది మందికి శిక్షలను యావజ్జీవంగా మార్పు.
2014 మే: యాకుబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌.
2014 జూన్‌ 2: క్షమాభిక్ష పిటిషన్లను ఓపెన్‌ కోర్టులోనే విచారణ జరపాలన్న నిబంధన మేరకు, ఉరిశిక్షను నిలిపివేసిన అత్యున్నత న్యాయస్ధానం.
2015 ఏప్రిల్‌ 9: మరణశిక్షపై యాకూబ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.
2015 జూలై 21: క్యూరిటివ్‌ పిటిషన్‌ తొసిపుచ్చిన సుప్రీం కోర్టు. జులై 30న ఉరిశిక్ష.
2015 జూలై 25: మరణ శిక్ష అమలుపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన మెమన్
2015 జూలై 28: మెమన్ పిటిషన్ పై నిర్ణయం త్రిసభ్య ధర్మాసనానికి అప్పగింత
2015 జూలై 29: యాకుబ్ మెమన్‌ క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరణ, ఉరిశిక్ష అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ నిరాకరణ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+