మహిళలను ఎలా సంబోధించాలి..? సర్వేలో తేలిందేంటంటే..

న్యూఢిల్లీ : నేతల మధ్య వివాదాలు జనాల్లో కొత్త చర్చలకు తావిస్తున్నాయి. ప్రజా ప్రతినిథుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తే క్రమంలో.. అసలు విషయం పక్కకు పోయి మరో కొత్త చర్చ తెర మీదకు వస్తోంది. తాజాగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ, బీహార్ మంత్రి అశోక్ చౌదరి మధ్య జరిగిన ట్విట్టర్ వార్, మహిళలను 'డియర్' అంటూ సంబోధించడం సరైందా..! కాదా..! అన్న సందేహాలను రేకెత్తించింది.

ఇదే విషయమై ప్రజల్లో ఉన్న అభిప్రాయమేంటో తెలుసుకోవాలని ప్రయత్నించిన ప్రముఖ పత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. కాగా, సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. డియర్ అనే సంబోధన 'సెక్సీయస్ట్ రిమార్క్' ఎంతమాత్రం కాదని 82 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించగా, 18 శాతం మంది మాత్రం సెక్సీయస్ట్ రిమార్క్ అవుతందని సమాధానమిచ్చారు.

women

దీంతో మహిళలను డియర్ అంటూ సంబోధించడాన్ని తప్పుబట్టిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి ఈ సర్వే జలక్ ఇచ్చినట్టయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇకపోతే సర్వేలో భాగంగా టైమ్స్ ఆఫ్ ఇండియా అడిగిన మరో రెండు ప్రశ్నలను గమనిస్తే.. ఎవరైనా మహిళకు ఓ లేఖ రాయాలంటే సదరు మహిళను ఏమని సంబోధిస్తూ లేఖ రాస్తే బాగుంటుంది? అని నెటిజెన్స్ ని ప్రశ్నించింది టైమ్స్ ఆఫ్ ఇండియా .

దీనికి సమాధానంగా.. 'హాయ్' అని సంబోధిస్తే బాగుంటుందని 31 శాతం మంది చెప్పగా, 'డియర్' అనడమే కరెక్ట్ అని 35 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే 'హలో' అన్న సంబోధన కూడా బాగానే ఉంటుందని 30 శాతం మంది, 'రెస్పెక్టెడ్' అంటే గౌరవంగా ఉంటుందని మరో 14 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇకపోతే మరో ప్రశ్నలో.. మహిళకు లేఖ రాస్తూ.. ఎలా ముగిస్తే బాగుంటుందన్న ప్రశ్నకు 'యువర్స్ సిన్సియర్లీ లేదా ఫెయిత్ ఫుల్లీ' అని సంబోధించడం బాగుంటుందని 16 శాతం మంది చెబితే, 'రిగార్డ్స్' అంటూ సంబోధించాలని 69 శాతం మంది చెప్పారు. అలాగే 'బెస్ట్' లేదా 'చీర్స్' తో కూడా లేఖను ముగించవచ్చని మరికొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+