న్యూయార్క్ టైమ్స్‌ స్వ్కేర్‌ రామ మయం - భజనలు, కీర్తనలతో పండుగలా..!!

ప్రపంచం మొత్తం అయోధ్య వైపు చూస్తోంది. శతాబ్దాల కల నెరవేరుతున్న వేళ దేశం మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయోధ్యకు జాతీయ- అంతర్జాతీయ ప్రముఖులు తరలి వచ్చారు. అన్ని రంగాల దిగ్గజాలు అయోధ్యలో చరిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుతున్నారు. దేశంలోనే కాదు విదేశాల్లొనూ అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేళ పండుగలా చేస్తున్నారు. న్యూయార్క్‌ ప్రఖ్యాత టైమ్స్‌ స్వ్కేర్‌ పై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. రాముడి భజనలతో హోరెత్తిస్తున్నారు.

అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.

Times Square in New York echoes with bhajans in celebrations of Ram Lallas Pran Pratishtha

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్‌ ప్రఖ్యాత టైమ్స్‌ స్వ్కేర్‌ పై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. అదేవిధంగా ఆ ప్రాంగణం అంతా రామ నామ జపంతో మార్మోగింది. అక్కడ ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. రామ భజనలు, కీర్తనలతో శ్రీరాముడి జెండాలను చేతబూని నగర వీధుల్లో హోరెత్తించారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు దేవాలయాల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి అయోధ్య వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రాముడి భజనతో భక్తులు తరిస్తున్నారు.

ఎన్నో ఏళ్ల కల ఫలిస్తున్న వేళ అయోధ్య మొత్తం కాషాయ మయం అయింది. ప్రధాని మోదీ అయోధ్య చేరుకున్నారు. నిర్ణయించిన ముహూర్తం మేరకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ఆ తరువాత ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగాలు ఉంటాయి. ఈ చారిత్రక ఘట్టం ప్రత్యక్షంగా వీక్షేందుకు కోట్లాది మంది నిరీక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+