కాళ్లు తొక్కిన బుడతడు: మురిసిన బ్రిటన్ యువరాజు

కజిరంగా: బ్రిటన్ యువరాజు విలియం, భార్య కేట్ మిడిల్టన్ గురువారం అస్సాంలోని కజిరంగా జాతీయ పార్క్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. విలియం దంపతులకు పార్క్‌లోకి స్వాగతం పలికేందుకు గాను అస్సాం సంప్రదాయ నృత్యం చేసే వారిని కొంత మందిని అక్కడ ఏర్పాటు చేశారు.

వీరిలో కాంఖాన్ బారువా అనే మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. తన తల్లిదండ్రుల మాదిరిగానే ముచ్చటగొలిపే వేషధారణలో వచ్చి చక్కగా డప్పు దరువుకు నృత్యం చేశాడు. డ్యాన్స్ చేస్తూ ఏ మాత్రం భయపడకుండా కేట్ దంపతుల కాళ్లు తొక్కాడు.

ఏదో ఒకసారో, రెండో సార్లో కాదు, ఆ డ్యాన్స్ అయిపోయేంత వరకు మధ్య మధ్యలో చాలా సార్లు తొక్కాడు. ఇంట్లో పిల్లలు తమ వారిని సరదాగా తొక్కినట్లుగా పదేపదే కేట్ దంపతుల కాళ్లను కాంఖాన్ తొక్కుతుండటంతో చిన్నారి తల్లిదండ్రులు కొంచెం భయపడ్డారు.

కేట్ దంపతులకు క్షమాపణలు చెప్పారు. దీనికి కేట్ దంపతులు స్పందిస్తూ, 'ఏం ఫర్వాలేదు. కాంఖాన్ తమ కుమారుడు జార్జ్‌ని గుర్తు చేశాడు. కాంఖాన్ కూడా తమ బిడ్డతో సమానమే' అని అన్నారు. కాంఖాన్ ను దగ్గరకు తీసుకుని ముద్దు చేశారు. చిన్నారి డ్యాన్స్ బాగుందంటూ చప్పట్లు కొట్టి మరీ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రపంచంలోని ఖడ్గమృగాల్లో అత్యధికం ఇక్కడే ఉండటంతో గట్టి భద్రత నడుమ రెండు గంటలపాటు విలియం దంపతులు ఓపెన్ జీపులో పార్కులోని ప్రకృతి అందాలను, ఖడ్గమృగాలు, జింకలు, అడవి దున్నలు, చూశారు. అనంతరం గురువారం న్యూఢిల్లీ నుంచి భూటాన్ పర్యనటకు బయల్దేరి వెళ్లారు.

ఈ సందర్భంగా కెన్సింగ్‌టన్‌ ప్యాలెస్‌ అధికారిక ట్విట్టర్‌ ద్వారా 'ప్రస్తుతానికి ఇండియాకి గుడ్‌బై... నాలుగు రోజులు అద్భుతంగా గడిచిపోయాయి' అని పోస్ట్‌ చేశారు. గురువారం భూటాన్‌ చేరుకున్న వీరికి అక్కడ ఘన స్వాగతం లభించింది. రాజధాని థింపూలో వారికి స్వాగతం పలికారు.

మురిసిన బ్రిటన్ యువరాజు

మురిసిన బ్రిటన్ యువరాజు

బ్రిటన్ యువరాజు దంపతుల కాళ్లు తొక్కుతూ డ్యాన్స్ చేసిన బుడతడు

మురిసిన బ్రిటన్ యువరాజు

మురిసిన బ్రిటన్ యువరాజు

బ్రిటన్ యువరాజు దంపతుల కాళ్లు తొక్కుతూ డ్యాన్స్ చేసిన బుడతడు

మురిసిన బ్రిటన్ యువరాజు

మురిసిన బ్రిటన్ యువరాజు

బ్రిటన్ యువరాజు దంపతుల కాళ్లు తొక్కుతూ డ్యాన్స్ చేసిన బుడతడు

మురిసిన బ్రిటన్ యువరాజు

మురిసిన బ్రిటన్ యువరాజు

బ్రిటన్ యువరాజు దంపతుల కాళ్లు తొక్కుతూ డ్యాన్స్ చేసిన బుడతడు

మురిసిన బ్రిటన్ యువరాజు

మురిసిన బ్రిటన్ యువరాజు

బ్రిటన్ యువరాజు దంపతుల కాళ్లు తొక్కుతూ డ్యాన్స్ చేసిన బుడతడు

మురిసిన బ్రిటన్ యువరాజు

మురిసిన బ్రిటన్ యువరాజు

బ్రిటన్ యువరాజు దంపతుల కాళ్లు తొక్కుతూ డ్యాన్స్ చేసిన బుడతడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+