viral video: రెండేళ్ల బాలుడ్నీ వదలని మృత్యువు.. ఈ పాపం ఎవరిది ?

ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌.. తమిళనాడులోని కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పదుల సంఖ్యలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉండటం కలచివేసింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. క్షతగాత్రులు ప్రస్తుతం కరూర్‌ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విజయ్ రోడ్ షో లో జరిగిన తొక్కిసలాటలో చిన్నారులు కూడా ప్రాణాలు వదలడం కన్నీళ్లు పెట్టిస్తోంది. తమ అభిమాన నటుడు, నాయకుడిని చూసేందుకు తల్లిదండ్రులు పిల్లలనూ తీసుకొచ్చారు. రెండేళ్ల దురు విష్ణు అనే బాలుడి నుదిటికి టీవీకే కండువా చుట్టి సంబరపడ్డారు ఆ పేరెంట్స్. కానీ తొక్కిసలాట రూపంలో వచ్చిన మృత్యువు ఆ పిల్లాడిని బలి తీసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది మైనర్లు చనిపోయారు. మృతుల్లో పిన్న వయస్కుడు విష్ణునే కావడం గమనార్హం.

Tiny Life Lost in Chaos 2-Year-Old s Death in Vijay Rally Stampede Sparks Viral Outrage

మరోవైపు ఈ ఘటనపై టీవీకే అధ్యక్షుడు హీరో విజయ్‌ కరూర్‌ ర్యాలీ తొక్కిసలాట ఘటన బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయనున్నట్లు విజయ్ తెలిపారు. అలాగే కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష పరిహారం అందించనున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+