IT hub: బెంగళూరులో ఆంధ్రా వ్యక్తిని నడిరోడ్డులో అడ్డంగా నరికేశారు. రాత్రి ఏం జరిగింది ?, పిన్ టూ పిన్ !

కొన్ని నిమిషాల్లో అతను ఇంటికి చేరుకొవలసి ఉంది. మార్గం మధ్యలో అతడి బైక్ అడ్డగించిన నిందితులు అతన్ని వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసి పరారైనారు.

బెంగళూరు/తిరుపతి: ఎప్పటిలాగే పని ముగించుకుని రాత్రి బైక్ లో ఇంటికి బయలుదేరాడు. కొన్ని నిమిషాల్లో అతను ఇంటికి చేరుకొవలసి ఉంది. మార్గం మధ్యలో అతడి బైక్ అడ్డగించిన నిందితులు అతన్ని వేటకొడవలితో నరికి దారుణంగా హత్య చేసి పరారైనారు. హత్య ఎవరు చేశారు అనే వియషంలో క్లారిటీ లేదని పోలీసులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా సంవత్సరాల క్రితం ఐటీ హబ్ చేరుకున్న అతను పిల్లలను బాగా చదివించాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని ఇప్పటికే ఇంటి స్థలం కూడా కొనుగోలు చేశాడు. స్నేహితులు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు.

రాత్రి ఏం జరిగింది

రాత్రి ఏం జరిగింది

బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరులోని జ్ఞానభారతి సమీపంలోని మంగనహళ్లి సమీపంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఆ సమయంలో మార్గం మధ్యలో బైక్‌ను అడ్డగించిన దుండగులు అతనితో గొడవ పెట్టుకున్నారు. ఆ సమయంలో అతను తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే నిందితులు మారణాయుధాలతో ఆవ్యక్తిపై దాడి చేసి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు.

కార్పెంటర్ హత్య

కార్పెంటర్ హత్య

మార్గం మధ్యలో ఓ వ్యక్తిని హత్య చేసి తప్పించుకున్నంటున్న సమంలో విషయం గుర్తించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. హత్య జరిగిందని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దినేష్ (46) అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారని బెంగళూరు సిటీ పోలీసులు గుర్తించారు.

ఆంధ్రా నుంచి బెంగళూరు వచ్చిన దినేష్

ఆంధ్రా నుంచి బెంగళూరు వచ్చిన దినేష్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దినేష్‌ అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నైస్‌ రోడ్డు సమీపంలోని మంగనహళ్లిలో చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా కార్పెంటర్‌గా పనిచేసిన దినేష్ తన పిల్లలను చదివించాలని, వచ్చిన ఆదాయంతో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరికతో ఉన్నాడు. ఇప్పటికే దినేష్ నైస్ రోడ్డు సమీపంలో ఇంటి స్థలం కూడా కొనుగోలు చేశాడని పోలీసులు అంటున్నారు. .

దినేష్ చాలా సైలెంట్

దినేష్ చాలా సైలెంట్

అయితే ఎప్పటిలాగే దినేష్ రాత్రి పని ముగించుకుని రాత్రి బైక్ లో ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఎవరో ఆపి అతన్ని దారుణంగా హత్య చేశారని పోలీసులు అంటున్నారు. స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం దినేష్ ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోలేదు. ఎప్పుడు చాలా సైలెంట్ గా ఉంటాడని, అతని పని అతను చేసుకుని నేరుగా ఇంటికి వెళ్లిపోతున్నాడని చెప్పారని పోలీసులు అంటున్నారు..

మ్యాటర్ బయటకు లాగుతున్న పోలీసులు

మ్యాటర్ బయటకు లాగుతున్న పోలీసులు

ఎంతో మంచివాడైన దినేష్ ను నడిరోడ్డులో దారుణంగా హత్య చేశారంటే నమ్మశక్యంగా లేదని అతని స్నేహితులు అంటున్నారు. పోలీసుల విచారణలో కూడా హత్యకు గల కారణాలు, హత్య ఎవరు చేశారనేది ఇంకా వెలుగు చూడలేదు. మరోవైపు ఘటనాస్థలిని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలించిన జ్ఞానభారతి పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని, హంతకుల కోసం గాలిస్తున్నామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు. రాత్రి నడిరోడ్డు మీద ఆంధ్రా వ్యక్తి దినేష్ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+