మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు ఇండియన్ రైల్వే అద్భుత నివాళి
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్.. ఈ పేరు విన్నంతనే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. టెర్రరిస్టులపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. 10 మంది పాకిస్తానీ టెర్రరిస్టులు పిస్టళ్లు, ఏకే47లు, బాంబులు, గ్రెనేడ్లు ఇతర పేలుడు పదార్థాలతో ముంబయి పై విరుచుకుపడ్డారు.
వారు అప్పుడు మారణహోమం సృష్టించారు. విదేశీయులను తాజ్ ప్యాలెస్ లో బందీలుగా పట్టుకున్నారు. 60 గంటల పాటు కొనసాగిన ఈ దాడుల్లో 160 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. గాయాలపాలైనవారి సంఖ్య వందల్లో ఉంటుంది.

తాజ్ ప్యాలెస్ లో దాగిన ఉగ్రవాదులను ఏరి వేసేందుకు NSG రంగంలోకి దిగింది. ఈ టీమ్ లో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కీలక పాత్ర పోషించారు. గదిలో చిక్కుకున్న ఓ మహిళా ఉద్యోగిని తీసకొస్తున్న క్రమంలో ఉగ్రవాదుల బుల్లెట్ ఉన్ని కృష్ణన్ శరీరంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో సందీప్ తన సహచరుల గురించే ఆలోచించారు.
ఎవరు ముందుకురావద్దని వాకీటాకీ ద్వారా మిగతావారిని హెచ్చరించి.. పౌరుల్ని, తన తోటి కమాండోలను, దేశ సమగ్రతను కాపాడే క్రమంలో ఉన్ని కృష్ణన్ వీరమరణం పొందారు. తద్వారా భారతీయుల గుండెల్లో అమరుడయ్యారు. ఆయన బలిదానానికి భారతీయ రైల్వే ఘనమైన నివాళి అర్పించింది. TKDWDP 48 40049 రైలుకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అశోక చక్ర అని నామకరణం చేసింది.
ఉన్ని కృష్ణన్ ప్రాణ త్యాగానికి గుర్తుగా ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర బిరుదునిచ్చి సన్మానించింది. తాజాగా భారతీయ రైల్వే ఓ రైలుకు ఆయన పేరు పెట్టింది. ఇటువంటి ఘనమైన నివాళులు గతంలో ఎవరికీ దక్కలేదు. ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో అడవిశేష్ ప్రధాన పాత్రలో మేజర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు శశికుమార్ దర్శకుడు. విడుదలైన అన్ని భాషల్లో మేజర్ ఘనవిజయం సాధించింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications