ఎంఎల్ఏ భార్యపై రివాల్వర్ తో కాల్పులు
బారక్ పూర్: కుటుంబ గొడవల కారణంగా శాసన సభ్యుడి భార్యను వారి బంధువు హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. హత్యాయత్నం చేసి పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.
పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ శాసన సభ్యుడు అర్జున్ సింగ్ భార్య ఉషా సింగ్ అలియాస్ నీరోజ్ సింగ్ మీద హత్యాయత్నం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. గోషాపుర రోడ్డులో అర్జున్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.
ఉషా సింగ్, ఆమె కుమారుడు పవన్ సింగ్ ఇంటిలో ఉన్నారు. అదే సమయంలో అర్జున్ సింగ్ కు వరుసకు కుమారుడైన (దగ్గర బంధువు) సౌరవ్ సింగ్ ఇంటిలోకి వెళ్లాడు. తరువాత ఉషా సింగ్ ఉన్న గదిలోకి వెళ్లి రివాల్వర్ తీసుకుని కాల్పులు జరిపి పరారైనాడు.

వెంటనే ఉషా సింగ్ ను ఆమె కుమారుడు పవన్ సింగ్ మెడికా సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి తరలించాడు. ఉషా సింగ్ కడుపులో బుల్లెట్ దూసుకు వెల్లడంతో ఆపరేషన్ చేసి తీసి వేశారని పోలీసులు అన్నారు. విషయం తెలుసుకున్న అర్జున్ సింగ్ ఆసుపత్రి చేరుకున్నారు.
ఆస్తి వివాదం కారణంగా సౌరవ్ సింగ్ ఉషా సింగ్ మీద హత్యాయత్నం చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ప్రత్యేక బృందాలు ఎర్పాటు చేసి సౌరవ్ సింగ్ కోసం గాలిస్తున్నామని బారక్ పూర్ కమీషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications