కోల్ కతా మున్సిపల్ ఎన్నికల్లో టీఎంసీ హవా..134 చోట్ల విజయం
పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ సత్తా చాటింది. తన కంచుకోటలో మమతా బెనర్జీ మరోసారి పై చేయి సాధించింది. బీజేపీ కేవలం సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం అయ్యింది. కాసిన్ని ఎక్కువ సీట్లు సాధించాలని అనుకున్న బీజేపీకి.. మమతా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దీంతో కమల దళం ఈ ఎన్నిల్లో వాడిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది.
కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు గల మొత్తం 144 సీట్లకు ఎన్నికలు జరిగితే, తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 134 సీట్లను కైవసం చేసుకుంది. స్వతంత్రంగా గెలుపొందిన వారు కూడా తృణమూల్‌కే మద్దతిస్తామని ప్రకటించారు. స్వతంత్రులతో కలిపితే తృణమూల్ 137 స్థానాలను కైవసం చేసుకున్నట్టు అవుతుంది. దీంతో బీజేపీకి పెద్ద శరాఘాతమనే చెప్పాల్సి ఉంటుంది.

బీజేపీ కేవలం 3 సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 2 , సీపీఎం 2 సీట్లను కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ 5 సీట్లను గెలుచుకుంటే, ఈ సారి 3 సీట్లకు మాత్రమే పరిమితమైనట్లు సమాచారం. మరోవైపు తాము కూడా తృణమూల్‌కే మద్దతిస్తామని, ఇలా ఇవ్వడం ద్వారా తమ వార్డుల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు.
టీఎంసీ 72 శాతం ఓట్లను సాధించింది. 11 శాతం ఓట్లతో లెప్ట్ ఫ్రంట్ రెండో స్థానంలో ఉంది. 65 వార్డల్లో ఉందిజ ఇటు బీజేపీ 47 వార్డులో 8 శాతం ఓట్లతో రెండో అత్యధిక ఓటు షేర్ కలిగి ఉంది.












Click it and Unblock the Notifications