లిఫ్ట్ లో చిక్కుకున్న తమిళనాడు మంత్రి, నరకం, భయంతో చెమటలు, తడిచి ముద్దయ్యాడు !
చెన్నై: తమిళనాడు మంత్రి ఓఎస్. మణియన్ లిఫ్ట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన క్షేమంగా మెడికల్ కాలేజ్ లిఫ్ట్ నుంచి బయటకు రావడంతో కాలేజ్ సిబ్బంది, అధికారులు, మంత్రి అనుచరులు ఊపిరిపీల్చుకున్నారు.
సోమవారం మంత్రి ఓఎస్. మణియన్ తిరువూరు మెడికల్ కాలేజ్ లోకి వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొనడానికి కాలేజ్ భనంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ లో బయలుదేరారు లిఫ్ట్ వెలుతున్న సమయంలో ఒక్క సారిగా ఆగిపోవడంతో మంత్రి ఓఎస్. మణియన్ హడలిపోయారు.

లిఫ్ట్ లోపల ఓఎస్ మణియన్ తనను రక్షించాలని కేకలు వేశారు. లిఫ్ట్ తెరవడానికి అక్కడి సిబ్బంది నానా తంటాలు పడ్డారు. దాదాపు 30 నిమిషాల తరువాత లిఫ్ట్ పలగొట్టిన సిబ్బంది మంత్రి ఓఎస్ మణియన్ ను క్షేమంగా రక్షించి బయటకు తీసుకు వచ్చారు. ఆ సమయంలో మంత్రి ఓఎస్ మణియన్ కు భయంతో చెమటలు పట్టి ఆందోళనతో తడిచి ముద్ద అయ్యారు.












Click it and Unblock the Notifications