చంద్రబాబు సర్కార్ ప్రోగ్రెస్ రిపోర్ట్ - ఆ శాఖతో మొదలు..!

ఏపీలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి సర్కార్ (AP Govt) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇందులో భాగంగా ప్రోగ్రెస్ రిపోర్టుల్ని విడుదల చేయబోతోంది. ఈ రెండేళ్లలో కీలకమైన 10 రంగాల్లో ఏం సాధించారన్న దానిపై ఈ నివేదికలు ఉండబోతున్నాయి. వీటిలో తొలి నివేదికను విద్యుత్ శాఖపై ఇవాళ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విడుదల చేస్తున్నారు.

Ys Jagan-Vijay: బ్రదర్ విజయ్..! వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్..!
Ys Jagan-Vijay: బ్రదర్ విజయ్..! వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్..!

రాష్ట్రంలో రెండేళ్ల పాలన తర్వాత కూడా ప్రభుత్వ శాఖల పనితీరు విషయంలో ప్రజల్లో పూర్తి సంతృప్తి కనిపించడం లేదు. దీంతో ఆయా శాఖల్ని ఈ రెండేళ్లలో తామేం చేశారో చెప్పుకునేలా సీఎం చంద్రబాబు (Chandrababu) ఈ నివేదికల్ని విడుదల చేయిస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాల్ని శాఖల వారీగా చెప్పుకునేందుకు వీలుంటుంది. కీలక మైన శాఖల నివేదికల్ని మాత్రం సీఎం చంద్రబాబు స్వయంగా విడుదల చేసే అవకాశం ఉంది.

Chandrababu Govt Releases 2-Year Report Card Power Sector Progress Report Out Today
హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్..!
హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్..!

విద్యుత్ శాఖపై సమీక్షలో ఈ రెండేళ్లలో కరెంటు ఛార్జీలు పెంచకపోవడం, అప్పటికే ఉన్న ఛార్జీల్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, రాష్టంలో విద్యుత్ సరఫరా తీరు, వ్యవసాయ విద్యుత్, ఇతర రంగాలకు ఇస్తున్న విద్యుత్ ను మెరుగుపర్చడం వంటి పలు అంశాల్ని ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. ఈ నివేదికల విడుదల ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. దీంతో ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదల కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని మంత్రులకు సీఎంవో నుంచి ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+