సీఎం వర్గంలోని స్లీపర్ సెల్స్ పేర్లు చెప్పను, పళని, పన్నీర్ చాలెంజ్: మంత్రితో నో లింక్ !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు టీటీవీ దినకరన్ మరో ఝలక్ ఇచ్చారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు టీటీవీ దినకరన్ మరో ఝలక్ ఇచ్చారు. మీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న నా వర్గంలోని స్లీపర్ సెల్ ను వీలైతే గుర్తించండి అంటూ సోమవారం టీటీవీ దినకరన్ సవాలు విసిరారు.

చెన్నైలో మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గంలో ఉన్న స్లీపర్ సెల్స్ పేర్లు తాను ఎటువంటి పరిస్థితుల్లో చెప్పనని అన్నారు. అవసరం అయినప్పుడు సీఎం ఎడప్పాడి పళనిసామి వర్గంలోని స్లీపర్ సెల్స్ బయటకు వస్తారని టీటీవీ దినకరన్ చెప్పారు.

TN Minister Sellur Raju is not a sleeper cell TTV Dinakaran

శశికళకు మద్దతుగా మాట్లాడిన తమిళనాడు మంత్రి సెల్లూర్ కే. రాజు స్లీపర్ సెల్ కాదని, మాతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని టీటీవీ దినకరన్ అన్నారు. మీతో ఆయనకు సంబంధం లేదని మీరు అంటున్నప్పుడు శశికళకు మద్దతుగా మంత్రి సెల్లూర్ కే. రాజు ఎందుకు మాట్లాడారు అంటూ మీడియా ప్రశ్నిస్తే ఆ విషయం ఆయన్నే అడగాలని టీటీవీ దినకరన్ అన్నారు. మంత్రి సెల్లూర్ కే. రాజు వ్యాఖ్యలతో తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం గుట్టుచప్పుడు కాకుండా ఆయన వ్యవహారం గురించి ఆరా తీస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+