Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో సింహం వచ్చిందని!: సింహం పిల్లను ఒళ్లో కూర్చోబెట్టుకొని ముద్దు చేసిన మంత్రి

చెన్నై/టోక్యో: తమిళనాడు మత్స్యశాఖ మంత్రి జయకుమార్ ఇటీవల తన జపాన్ పర్యనట సందర్భంగా అక్కడి జపాన్ ఇంటర్నేషనల్ సీఫుడ్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మత్య్సశాఖకు, సముద్రపు ఆహారానికి సంబంధించిన అంశాల గురించి చర్చించడానికి నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఫుజిలోని సఫారీ పార్కును సందర్శనకు వెళ్లారు. ఆయన పార్కులో పర్యటిస్తుండగా అక్కడ జయకుమార్‌కు ఓ సింహం పిల్ల కనబడింది.

TN minister visits Japan, pens ode to his son, a lion cub

దానిని చూసి ముచ్చటపడిన ఆయన నిర్వాహకులను అడిగి కాసేపు దానిని ఎత్తుకొని ముద్దు చేశారు. దానిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఫొటో దిగారు. ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.

అంతేకాదు సింహం పిల్లను ఎత్తుకున్నప్పుడు తన కలిగిన ఆలోచనలను ఓ పద్యంలా కూడా రాశారు. ఆ సింహం పిల్ల తనను చూసి తమిళనాడు నుంచి మరో సింహం వచ్చిందని అనుకుందని, తనను తన తండ్రి అనుకుని తన ఒడిలోకి వచ్చి కూర్చుందని రాశారు. ఆ పద్యాన్ని పలువురికి షేర్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+