మోడీ చెన్నై పర్యటన: నిప్పంటించుకుని యువకుడి ఆత్మహత్య
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెన్నై పర్యటన నేపథ్యంలో కావేరి బోర్డు విషయంలో కేంద్ర నిర్లక్ష్యానికి నిరసనగా ఓ యువకుడు గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ప్రధాని మోడీ గురువారం తమిళనాడుకు రావడంతో స్థానిక పార్టీలో తమ నిరసనలు ఉధృతం చేశాయి. గోబ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేస్తూ నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేశారు. విమానాశ్రయం వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.

ఈ క్రమంలో, చెన్నైలోని ఈరోడ్ కి చెందిన ధర్మలింగం అనే యువకుడు కావేరి జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరాశకు లోనయ్యాడు.
కావేరి బోర్డు ఏర్పాటుపై ప్రధాని స్పందికపోవడంతో.. తన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇంటి గోడపై రాసి అనంతరం ధర్మలింగం ఆత్మాహుతికి పాల్పడ్డాడు.
మంటల్లో కాలిపోతున్న యువకుడిని ఇరుగు పొరుగువారు గమనించి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన ధర్మలింగం.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతి పట్ల స్థానిక రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఈ ఘటనతో మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. వెంటనే కావేరి బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications