ప్రియురాలితో లేచిపోయేందుకు ఘోరం: చనిపోయానని భార్యను నమ్మించేందుకు..
రూర్కీ: ప్రేమ కోసం ఏదైనా చేసేందుకు ప్రేమికులు సిద్ధంగా ఉంటారు. మొహమ్మద్ ముకర్రమ్ అనే వ్యక్తి మాత్రం మరీ దారుణంగా ప్రవర్తించాడు. అదీ అతనికి పెళ్లయ్యాక... ప్రియురాలితో కలిసి లేచిపోయేందుకు దారుణానికి ఒడిగట్టాడు.
తాను చనిపోయానని భార్యను నమ్మించేందుకు ఓ బిచ్చగాడిని అతిక్రూరంగా చంపేసి, ప్రియురాలితో లేచిపోయాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. మొహమ్మద్ ముకర్రమ్‌కు పెళ్లయింది. నలుగురు పిల్లలు.
భార్య ఉన్నప్పటికీ 22 ఏళ్ల మరో యువతిని ప్రేమించాడు. ఆమెతో వెళ్లిపోవాలనుకున్నాడు. అందుకోసం తన భార్య, పిల్లలు అంగీకరించరని తెలుసు. దీంతో వారిని తాను చనిపోయానని నమ్మించాలనుకున్నాడు. ఓ బిచ్చగాడిని గుర్తుపట్టలేనంత దారుణంగా హతమార్చాడు.

అతని జేబులో తన ఓటర్ కార్డు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మహమ్మద్ ముకర్రమ్ కొంతకాలంగా వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు.
విషయం తెలీక మహమ్మద్ ముకర్రమ్ తన కొత్త సిమ్ కార్డును ఫోన్‌లో వేశాడు. కొత్త నెంబరు ఆయన ప్రేమించిన యువతికి కూడా తెలియకపోవడంతో ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు. యువతికి మొహమ్మద్ పదే పదే ఒకే నెంబరు నుంచి ఫోన్ చేయడంతో పోలీసులు అతన్ని వెతికి పట్టుకుని అరెస్ట్ చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications