Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశ్మీర్ కోసం 100సార్లు నరకానికి వెళ్లడానికైనా సిద్ధం: ఒమర్‌కు మెహబూబా ముఫ్తీ కౌంటర్

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ను కాపాడటం కోసం తాను వందసార్లు నరకానికి వెళ్లడానికైనా సిద్ధమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లో అధికార పీడీపీ, భారతీయ జనతా పార్టీల పొత్తుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా విమర్శలు చేసిన నేపథ్యంలో ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పీడీపీ-బీజేపీ పొత్తును 'దెయ్యంతో పొత్తు'గా పోలుస్తూ అబ్దుల్లా వ్యాఖ్యలు చేశారు. 'ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు దెయ్యంతో పొత్తులాగే ఉన్నాయి. మీరు(సీఎం) ఉపవాసాలు, ప్రార్థనలు చేసి ఈ పాలనా విధానాలను మార్చాలి. అప్పుడే మీ రాజకీయ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉంటుంది' అని అబ్దుల్లా విమర్శించారు. దీనికి స్పందించిన ముఫ్తీ.. కాశ్మీర్‌ ప్రజల శ్రేయస్సు కోసం తాను వందసార్లు నరకానికి వెళ్లడానికి సిద్ధమని అన్నారు.

To save J&K people, ready to go to hell 100 times: Mehbooba Mufti

'నేను నరకానికి వెళ్లాలంటూ ఆయన(ఒమర్‌ అబ్దుల్లా) ఇప్పుడు ఫత్వా ఇస్తున్నట్లున్నారు. కానీ మనకు దేవుడు స్వర్గాన్ని ఇచ్చాడు. కాశ్మీర్‌ స్వర్గం. ఆ స్వర్గాన్ని కాపాడటం కోసం వంద సార్లు నరకానికి వెళ్లడానికైనా నేను సిద్ధమే. ప్రజల శ్రేయస్సు కోసం నేను ఆ పని చేస్తే నాకు సంతోషమే. నాకు అదేం పెద్ద కష్టం కాదు' అని మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+