Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరుకు Escart చెడ్డపేరు, కాల్ గర్ల్స్ దందా, అర్దనగ్న ఫోటోలు, మాజీ హోమ్ మంత్రి రెడ్డి ఫైర్ !

బెంగళూరు: బెంగళూరు సిటీ ఇప్పుడు సెక్స్ సిటీ అనే అపవాదు మూటకట్టుకుంటోందా ? అంటే అవుననే అని అంటున్నాయి విచ్చలవిడిగా తెరమీదకు వచ్చిన బూతు వెబ్ సైట్లు. బెంగళూరు సిటీ కోరమంగలకు ప్రత్యేక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇప్పుడు అదే కోరమంగల పేరుతో విచ్చలవిడిగా Escorts(ఎస్కార్ట్స్) వెబ్ సైట్లు తెర మీదకు రావడంతో స్థానికులు హడలిపోయారు. ఈ సెక్స్ రాకెట్ పేరుతో వెబ్ సైట్లు ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతంలో సంసారం చేసుకునే వారు రోడ్ల మీద తిరగలేమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోరమంగల ప్రాంత ప్రజలు స్థానిక శాసన సభ్యుడు, మాజీ హోమ్ మంత్రి రామలింగా రెడ్డిని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

కోరమంగల పేరుతో Escort వెబ్ సైట్లు

కోరమంగల పేరుతో Escort వెబ్ సైట్లు

బెంగళూరు నగరంలోని కోరమంగల పేరుతో విచ్చలవిడిగా Escort వెబ్ సైట్లు పుట్టుకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వెబ్ సైట్లు చూసిన స్థానికులు హడలిపోయారు. అందమైన అమ్మాయిలు అర్దనగ్నంగా ఉన్న ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఆ ఫోటోలు తీసుకొచ్చి వెబ్ సైట్లలో పెట్టారు. కోరమంగల ప్రాంత ప్రజలు ఈ విషయం గుర్తించి స్థానిక శాసన సభ్యుడు, మాజీ హోమ్ మంత్రి రామలింగా రెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఆసిఫా ఫోన్ నెంబర్

ఆసిఫా ఫోన్ నెంబర్

ఆసిఫా 733...........111 Koramangala call girls అనే పేరుతో సోషల్ మీడియాలో అక్రమ కార్యకలాపాలు, సెక్స్ రాకెట్ దందా జరుగుతోందని స్థానికుల గుర్తించారు. కోరమంగల పేరుతో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై విచారణ జరిపించి భాద్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంతో మాట్లాడాలని స్థానికులు శాసన సభ్యుడు, మాజీ హోమ్ మంత్రి రామలింగా రెడ్డికి మనవి చేశారు.

100పైగా సెక్స్ రాకెట్ ల వెబ్ సైట్లు

100పైగా సెక్స్ రాకెట్ ల వెబ్ సైట్లు

కోరమంగల పేరుతో సుమారు 100పైగా బూతు వెబ్ సైట్లు, సెక్స్ రాకెట్ లు, Koramangala call girls, Eseort వెబ్ సైట్లు దర్శనం ఇస్తున్నాయి. కోరమంగల పేరుతో ఇలా బూతు వెబ్ సైట్లు విచ్చలవిడిగా దర్శరం ఇవ్వడంతో స్థానికులు, మహిళలు. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇక్కడ తిరగాలా ? వద్దా ? అంటూ మహిళలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

 అడ్రస్ లు, అమ్మాయిల అర్దనగ్న ఫోటోలు

అడ్రస్ లు, అమ్మాయిల అర్దనగ్న ఫోటోలు

కోరమంగల పేరుతో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్న వెబ్ సైట్లలో అందమైన అమ్మాయిల అర్దనగ్న ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి. అమ్మాయిల పేర్లు, ఇ మెయిల్ అడ్రస్ లు దర్శనం ఇస్తున్నాయి. విచ్చలవిడిగా తెర మీదకు వచ్చిన Escort వెబ్ సైట్లలో ఎవరి ఫోటోలు ఉన్నాయో ? ఏమో ? అనే విషయం అర్థం కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 అమ్మాయిల ఫోటోలు, చెప్పలేని రేట్లు

అమ్మాయిల ఫోటోలు, చెప్పలేని రేట్లు

Escort పేరుతో ఉన్న వెబ్ సైట్లలో అమ్మాయిల ఫోటోలతో పాటు వారితో ఎంజాయ్ చెయ్యడానికి కొందరు రేట్లు పిక్స్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం కొన్ని వెబ్ సైట్ లింక్ లో ఓపెన్ చేస్తే అది నిజమే అనే విషయం వెలుగు చూసింది. అమ్మాయిల అర్దనగ్న ఫోటోలతో పాటు రేట్లు ఉన్న విషయం గుర్తించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

వాట్సప్ లో దందాలు

వాట్సప్ లో దందాలు

కోరమంగల పేరుతో ఎక్కువగా జరుగుతున్న సెక్స్ రాకెట్ దందా మొత్తం వాట్సప్ లో జరుగుతోందని పోలీసులు అంటున్నారు. వాట్సాప్ కాల్స్ లోకేషన్స్ మీద నిఘా వేసి ట్రేస్ చెయ్యడానికి ప్రయత్నిస్తే ముంబై, ఢిల్లీ, కొల్ కత్తా తదితర వేరేవేరే నగరాల టవర్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని వెలుగు చూస్తొందని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇలాంటి వెబ్ సైట్ లు, దందాలు నిర్వహిస్తున్నారని మా విచారణలో వెలుగు చూసిందని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

 వీడియోలతో బ్లాక్ మెయిల్

వీడియోలతో బ్లాక్ మెయిల్

అమ్మాయిల అర్డనగ్న ఫోటోలు చూసి వారు చెప్పిన లోకేషన్స్ కు వెళ్లిన కొందరి దగ్గర అధిక మొత్తంలో నగదు వసూలు చేశారని, వెబ్ సైట్ లలో ఉన్న అమ్మాయిలో అక్కడ లేరని తెలిసింది. కొందరు యువకులు అశ్లీలంగా అమ్మాయిలతో గడుపుతున్న సమయంలో వీడియోలు తీసి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారని ఆరోపణలు, ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే కొందరు మాత్రం పరువు పోతుందని భయంతో నిందితులు అడిగిన మొత్తం నగదు ఇచ్చి తప్పించుకుంటున్నారని తమకు తెలిసిందని, ఫిర్యాదులు లేనిదే మేము ఏమి చెయ్యలేమని కొందరు పోలీసులు అంటున్నారని తెలిసింది.

ఏమిటి ఈ దరిద్రం ? సెక్స్ రాకెట్ దందా !

ఏమిటి ఈ దరిద్రం ? సెక్స్ రాకెట్ దందా !

ఈ కోరమంగల సెక్స్ రాకెట్ దందా ఏమిటి ?, ఈ దరిద్రం గురించి విచారణ జరిపించించి స్థానికులు ఆందోళకు గురికాకుండా చూడాలని కర్ణాటక మాజీ హోమ్ మంత్రి, బెంగళూరు నగరంలోని బీటీఎం లేఔట్ శాసన సభ్యుడు (కాంగ్రెస్) రామలింగా రెడ్డి కర్ణాటక డీజీపీ నీలమణి రాజు, బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ కు లేఖ రాశారు. వెంటనే సోషల్ మీడియాలో కోరమంగల పేరుతో ఉన్న సెక్స్ రాకెట్ లింక్ లు, సెక్స్ రాకెట్ దందా లింక్ లు తొలగించాలని, వాటి నిర్వహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ హొమ్ మంత్రి రామలింగా రెడ్డి డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+