UP News: యువతకు శుభవార్త.. టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం.. ఇక ఉద్యోగాలే తరువాయి.. !
యూపీలోనిని 150 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయడానికి టాటా టెక్నాలజీస్‌తో ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో యూపీలోని స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కొత్త శకానికి నాంది పలుకుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యువత నైపుణ్యం మాత్రమే కాకుండా ఆధునిక పరిశ్రమ డిమాండ్‌లకు సరిపోయేలా ఉండాలని చెప్పారు.

నైపుణ్యం
ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని యువత నైపుణ్యాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా టాటా టెక్నాలజీస్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కూడా సహాయపడుతుందని ఆదిత్యనాథ్ అన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలతో యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో, సాంకేతిక స్థాయిలో విస్తృతమైన మార్పులు వచ్చాయన్నారు.

5,472 కోట్లు
కానీ రాష్ట్రంలోని ఐటీఐలు అప్‌గ్రేడ్ కాలేదని.. మనం కొత్త సాంకేతికతకు అనుగుణంగా లేకపోతే ఖచ్చితంగా వెనుకబడి ఉంటామని తెలిపారు. కాలంతో పాటు కొత్త టెక్నాలజీకి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలలో కూడా చేరాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌తో ఈరోజు రూ. 5,472 కోట్ల MoAపై సంతకం చేసిందని చెప్పారు.

ఏటా 35,000 మంది
తమ ఐటీఐల ప్రయోగశాలలు, పరికరాలను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని ఐటీఐలకు టాటా టెక్నాలజీస్ నుంచి మంచి శిక్షకులు కూడా అందుబాటులో ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో ఏటా 35,000 మంది యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు టాటాతోపాటు విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉద్యోగాలు పొందగలుగుతారని యోగి ఆధిత్యనాథ్ పేర్కొన్నారు.

షార్ట్ టర్మ్ కోర్సులు
ఇంజినీరింగ్, టెక్నాలజీ కంపెనీ కావడంతో ఇక్కడి యువతను ఈ రంగంలో మరింత మెరుగ్గా తీర్చిదిద్దడమే తమ దృష్టి ఉందని టాటా టెక్నాలజీస్ సీఈఓ వారెన్ హారిస్ అన్నారు. ఈ ఒప్పంద ప్రకారం UPలో 150 ITIలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు ఈ ఐటీఐలలో మా సంస్థ తరపున 11 కొత్త యుగం లాంగ్ టర్మ్ ట్రేడ్‌లు, 23 కొత్త షార్ట్ టర్మ్ కోర్సులను నిర్వహిస్తామని, ఇక్కడి యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధితో అనుసంధానం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications