ఠాక్రే బ్రదర్స్ Vs మహాయుతి వార్‌లో నెగ్గేదెవరు ? 29 కార్పొరేషన్ల రిజల్ట్ డే !!

మహారాష్ట్ర రాజకీయాల్లో నేడు మరో కీలక ఘట్టానికి తెరపడనుంది. దేశంలోనే అత్యంత సంపన్నమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు నేడు (జనవరి 16, 2026 ) వెలువడనున్నాయి. గురువారం నాడు పోలింగ్ జరగ్గా సుమారు 50 శాతం ఓటింగ్ నమోదైనట్టు ప్రకటించారు. ఈ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల గెలుపోటములకే పరిమితం కాకుండా.. మహారాష్ట్ర రాజకీయాల్లోని ప్రధాన పార్టీల బలాబలాలను నిర్ధారించే కీలక పరీక్షగా మారాయి. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 2,801 సీట్లకు నిన్న పోలింగ్ జరగగా, ఇప్పటికే 68 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఈ ఫలితాలను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 'సెమీ ఫైనల్'గా భావిస్తుండటంతో అధికార పక్షం, విపక్షం రెండూ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ-ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమికే అనుకూలంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి.

today-counting-for-maharashtra-municipal-elections-voting

ముంబైలో 130కి పైగా సీట్లు మహాయుతి ఖాతాలో పడే అవకాశముందని అంచనాలు వెలువడటంతో, శివసేన (ఉద్ధవ్) వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బీఎంసీలో మొత్తం 227 వార్డులు ఉండగా, అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే కనీసం 114 సీట్లు గెలవాల్సి ఉంటుంది. మరి ఈ ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తాయా? లేక ఉన్న శక్తిసమీకరణలనే మరింత బలోపేతం చేస్తాయా? అన్నది కొద్ది గంటల్లో తేలనుంది.

మరోవైపు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిసి ఎన్నికల బరిలో దిగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. ముంబైపై పట్టు కోల్పోకుండా ఉండాలనే లక్ష్యంతో "ఠాక్రే బ్రదర్స్" చేసిన ఈ ఐక్యత ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేసిందన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇక పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేయడం మరో ఆసక్తికర అంశంగా మారింది.

జాతీయ స్థాయిలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో 'పవార్ కుటుంబం' ఒక్కటవడం రాజకీయ విశ్లేషకులను ఆకర్షిస్తోంది. పుణెలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ, పవార్ల ఐక్యత పోటీని తీవ్రంగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికల పోలింగ్ సమయంలో మరో వివాదం కూడా చెలరేగింది. సాధారణంగా వేలికి వేసే శాశ్వత సిరా స్థానంలో మార్కర్ పెన్నులు ఉపయోగించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+