ఆడవాళ్లు అర్ధనగ్నంగా బజార్లో తిరిగితే అంతే: బెంగళూరు ఘటనపై అబూ అజ్మీ

బెంగళూరులో డిసెంబర్ 31 రాత్రి జరిగిన 'కీచక పర్వం'పై తాజాగా సమాజ్ వాది పార్టీ నాయకుడు అబు అజ్మీ కూడా స్పందించారు.

న్యూ ఢిల్లీ: బెంగళూరులో డిసెంబర్ 31 రాత్రి జరిగిన 'కీచక పర్వం'పై వివిధ రాజకీయ పార్టీల నాయకుల స్పందన, ప్రతిస్పందనలు ఊపందుకున్నాయి. ఇప్పటికే దీనిపై తనదైన శైలిలో వ్యాఖానించి కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర్ మహిళాలోకం నిరసనలు మూటగట్టుకోవడం, మరోవైపు మంత్రి వ్యాఖ్యలు తప్పుబడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ట్విటర్ లో స్పందించడం తెలిసిందే.

తాజాగా ఈ వివాదాస్పద ఘటనపై సమాజ్ వాది పార్టీ నాయకుడు అబు అజ్మీ కూడా స్పందించారు. ఈయన కూడా మహిళాలోకాన్నే తప్పుబట్టారు. ప్రస్తుతం కురచ దుస్తులు ధరించి తిరగడం ఫ్యాషన్ అయిపోయిందని, అర్ధనగ్నంగా కనిపించడం, పరాయి మగవాళ్ళతో చెట్టాపట్టాలేసుకొని తిరగడమే ఆధునిక మహిళకు అర్థంగా భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రోజురోజుకీ మన దేశంలో ఇలాంటి సంస్కృతి పెరిగిపోతోందని తెలిపారు.

Abu Azmi

అంతేకాదు, భర్తగాని, తమ్ముడుగాని తోడు లేకుండా మహిళలు నైట్ పార్టీల్లో పాల్గొనడాన్ని అసలు మన హైందవ సంసృతి అంగీకరించదని, పెట్రోలు ఉన్నచోట నిప్పు రాజుకుంటుందని, బెల్లం ఉన్న చోట ఈగలు ముసురుకుంటాయనే విషయం విద్యావంతులైన నేటి ఆధునిక మహిళలకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.

"నా చెల్లెలైనా లేదా నా కూతురైనా సరే, కుటుంబ సభ్యుల తోడు లేకుండా పరాయి మగాళ్ళతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడం తప్పే.." అని అబు అజ్మీ కుండ బద్దలు కొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+