టోల్ ఫీజ్ అడిగితే కాల్చి చంపేస్తా జాగ్రత్త
జైపూర్: టోల్ ఫ్లాజ్ లో ఫీజ్ కట్టమని చెప్పిన సూపర్ వైజర్ ను రివాల్వర్ చూపించి చంపేస్తానని బెదిరించారు. అంతే కాకుండా నేను ఎవరనుకున్నావురా ? నువ్వు ఎంత, నీ బతుకెంత ? అంటూ బెదిరించి రౌడీయిజం చేశారు. ఉద్యోగం చెయ్యాలంటే మాకు భయంగా ఉందని టోల్ ఫ్లాజా ఉద్యోగులు అంటున్నారు.
అంకిత్ మీనా అనే వ్యక్తి ఆజ్మీర్ లోని టోల్ ఫ్లాజాలో సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సర్వార్ రోడ్డులో వెలుతున్న ఓ వాహనాన్ని నిలిపి టోల్ ఫీజ్ కట్టాలలని అంకిత్ మీనా చెప్పాడు. ఆ సందర్బంలో కారులో ఉన్న ధన్ సింగ్ అనే వ్యక్తి రెచ్చి పోయాడు. తన డ్రైవర్ తో కలిసి బయటకు వచ్చాడు.

రివాల్వర్ బయటకు తీసి నన్నే టోల్ ఫీజ్ అడుగుతావా ? ఇప్పుడే నిన్ను అంతం చేస్తానని బెదిరించాడు. తరువాత ఊగిపోయిన ధన్ సింగ్ రివాల్వర్ తీసుకుని అక్కడ నానా హంగామా చేశాడు. చివరికి తన వాహనంలో అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అంకిత్ మీనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు టోల్ ఫ్లాజాలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి వివరాలు సేకరించారు. అదే సమయంలో మరి కోందరు ఉద్యోగులు ధన్ సింగ్ మీద ఫిర్యాదు చేశారు. గతంలో తమను ఇలాగే బెదిరించాడని, ధన్ సింగ్ కారణంగా తాము ఇక్కడ ఉద్యోగాలు చెయ్యలేకపోతున్నామని పోలీసులకు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications