కిలో టమాటా రెండు రూపాయలే...అధిక ఉత్పత్తి తక్కువ డిమాండే కారణం
Recommended Video

గత నెలలో టమాటా మాట మాట్లాడాలంటేనే కళ్లు ఎరుపు ఎక్కేవి. ఎందుకంటే దాని ధర కిలో 100 రూపాయలు పలికింది. కానీ దేశవ్యాప్తంగా ఉన్న హోల్ సేల్ మార్కెట్లో ఇప్పుడు టమాటా ధర కిలో రెండు రూపాయలు పలుకుతోంది. అంతలా టమాటా ధర పడిపోయింది. మహారాష్ట్రలోని నారాయణగావ్ హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ.2కు పడిపోగా మదనపల్లె మార్కెట్లో టమాటా ధర కిలో రూ.1.60 పైసలు. ఒక్కసారిగా ధరలు నేలచూపులు చూడటంతో రైతులు దిగులు చెందుతున్నారు. తమకొచ్చే నష్టాన్ని తలుచుకుని లబోదిబోమంటున్నారు.
టమాటా ఉత్పత్తి పెరిగిపోవడం మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. ఆగష్టు నెల ఆంధ్రప్రదేశ్‌కు అచ్చొచ్చినట్లు లేదు. సరైన వర్షాలు లేక..టమాటాకు డిమాండ్, వినియోగం తక్కువకావడంతో ధరలు ఒక్కసారిగి పతనమయ్యాయి. గతేడాది 20 కేజీల టమాటా క్రేట్ రూ.900 నుంచి రూ.1400 ధర పలికింది. కానీ ఇప్పుడు అదే క్రేట్ ధర రూ.400కు పడిపోయింది. గతేడాది ధరలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా టమాటానే పండించారు రైతులు. అయితే సరైన వర్షాలు లేక పంటలో నాణ్యత లోపించింది. మరోవైపు దక్షిణాదిన కురిసిన భారీ వర్షాలతో పాటు ఆ రాష్ట్రాలను వరదలు ముంచెత్తడంతో టమాటా సప్లై కూడా నిలిచిపోయింది. ఈ కారణాలతో టమాటా ధర భారీగా పడిపోయింది.

ఇదిలా ఉంటే మరికొన్ని కూరగాయల ధరలు మాత్రం ఆకాశానంటుతున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. పచ్చిమిర్చి ముట్టుకుంటుంటే ఆ ధరల ఘాటు నషాలానికి అంటుతోంది. ఇక 2017-18లో 22 మిలియన్ టన్నుల ఉల్లి పంట పండిందని ఇది 2016-17 కంటే కాస్త తక్కువేనని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. మరోవైపు ఆలుగడ్డ ఉత్పత్తి స్థిరంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. మొత్తంగా చూస్తే కూరగాయల ఉత్పత్తి గతేడాది కంటే ఒక శాతం పెరిగిందని చెప్పిన వ్యవసాయ శాఖ... పండ్లు కూడా గతేడాది కంటే 4.5శాతం ఎక్కువగా పండాయని వెల్లడించింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications