"ఫుల్ గా తాగి పడిపోతే నో ప్రాబ్లమ్.. పోలీసులు ఇంట్లో దింపేస్తారు"..! హోం మంత్రి షాకింగ్ కామెంట్స్..
దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. నూతన సంవత్సరాన్ని గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'అయితే న్యూ ఇయర్ వేడుకల్లో ఫుల్ గా తాగారా..? ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారా..? అయితే ఈ బూత్ లకు చేరుకోండి.. మిమ్మల్ని పోలీసులే దగ్గరుండి ఇంట్లో దింపేస్తారు..' అని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. ఈ మేరకు బెంగళూరులో 15 బూత్ లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరుకు వస్తున్న క్రమంలో హోం మంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఫుల్ గా తాగి ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నవారి కోసం ప్రత్యేకంగా బూత్ లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలా నగరం వ్యాప్తంగా 15 బూత్ లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా రోడ్లపై ఫుల్ గా తాగి పడిపోయిన వారిని మొదటగా ఈ బూత్ లకు తరలిస్తారని.. కొద్దిసేపటికి మత్తు దిగాక వారి ఇంటి అడ్రస్ తెలుసుకుని పోలీసులే స్వయంగా వారిని ఇంట్లో దిగబెడతారని తెలిపారు. అయితే ఈ వెసులుబాటు అందరికీ కాదని.. కేవలం మహిళలకే ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
"ముఖ్యంగా హుబ్బల్లి, మంగళూరు జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమికూడి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బెంగళూరుకు భారీ సంఖ్యలో ఔత్సాహికులు వస్తుంటారు. న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. సమయం అర్ధరాత్రి 12 కాగానే ప్రజలు ఒకర్నొకరు విష్ చేసుకుంటారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశాం" అని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర స్పష్టం చేశారు.

"నగరంలో దాదాపు 150-160 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పాట్స్ ఏర్పాటు చేశాం. కఠినమైన నిబంధనలను పెట్టాం. పోలీసులు కచ్చితంగా బాడీ కెమెరాలను ధరించాలని దాంతో పబ్లిక్ తో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో రికార్డు అవుతుంది. ఆ కెమెరాలు కమాండ్ సెంటర్ కు కనెక్ట్ అయి ఉంటాయి. అవసరం అనుకుంటే అదనపు బలగాలను కూడా మోహరిస్తాం" అని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు.












Click it and Unblock the Notifications