‘చౌకిదార్ వీక్.. ఇక అన్నీ లీక్’: మోడీపై రాహుల్ సెటైర్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి సెటైర్లు వేశారు. ఇటీవల ఫేస్‌బుక్ డేటా దుర్వినియోగం, సీబీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలో వీటిని ఉటంకిస్తూ రాహుల్ ప్రధానిపై ట్విట్టర్ వేదిక విమర్శలు చేశారు.

'ఎన్ని లీకులు? డేటా లీక్! ఆధార్ లీక్! ఎస్‌ఎస్‌సీ పరీక్ష ప్రశ్న పత్రం లీక్! ఎన్నికల తేదీ లీక్! సీబీఎస్‌ఈ పేపర్ లీక్! అన్నింటా లీక్... చౌకీదార్ వీక్' అంటూ హిందీ, ఇంగ్లీష్‌లో రాహుల్ ట్వీట్ చేశారు.
कितने लीक?
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2018
डेटा लीक !
आधार लीक !
SSC Exam लीक !
Election Date लीक !
CBSE पेपर्स लीक !
हर चीज में लीक है
चौकीदार वीक है#BasEkAurSaal
అంతేగాక, #BasEkAurSaal (అధికారంలో ఉండేది ఇంకా ఒక్క సంవత్సరమే అనే అర్థం వచ్చేలా) అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.












Click it and Unblock the Notifications