లోక్‌సభ ఎన్నికల వేళ భారీ ఎన్‌కౌంటర్: మావో అగ్రనేతతోపాటు 29 మంది నక్సల్స్ మృతి
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత పాటు 18 మంది నక్సల్స్ మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో బీఎస్ఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో బీఎస్ఎఫ్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్ రావుతోపాటు 18 మంది నక్సల్స్ మృతి చెందారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. నక్సల్స్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు చెప్పారు.

మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో గాయపడిన పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బందిని ఆస్పత్రులకు తరలించేందుకు అదనపు బలగాలను కల్పర్ అడవులకు పంపించామని తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్పీ కళ్యాణ్ ఎల్లిసెల వెల్లడించారు.
#WATCH | "Bodies of 18 naxals recovered from encounter site in Chhotebethiya of Kanker. 3 jawans were injured in the operation. Search operation underway. This can be seen as one of the biggest anti-naxal operations in the area. The operation was launched after information of the… pic.twitter.com/7YeUxEzoq5
— ANI (@ANI) April 16, 2024
ప్రస్తుతం ఛోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోందని కాంకర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐకె ఎలెసెలా తెలిపారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత శంకర్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది
29కి చేరిన మృతుల సంఖ్య: ఎన్‌కౌంటర్ పై అమిత్ షా ఏమన్నారంటే?
ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 29కి చేరింది. కాగా, ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మావోయిస్టులపై ఆపరేషన్ విజయవంతం చేసినందుకు భద్రతా బలగాలను అమిత్ షా అభినందించారు. దేశ అభివృద్ధి, శాంతిభద్రతలు, యువత భవిష్యత్తుకు నక్సలిజం శత్రువని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ భావజాలం కొంత ప్రాంతానికే పరిమితమైందన్నారు. త్వరలో ఛత్తీస్ గఢ్ తోపాటు దేశ వ్యాప్తంగా నక్సల్స్ లేకుండా చేస్తామన్నారు. గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని హోంమంత్రి ఆకాంక్షించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications