• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Torture: నాటుకోడిలా చిక్కిందని 17 ఏళ్ల యువతిని 22 రోజులు ఫ్రెండ్స్ రేప్, చిన్న గొడవతో జీవితం!

|

భువనేశ్వర్/ పాట్నా: తల్లిదండ్రులతో గొడవపడిన 17 ఏళ్ల యువతి బంధువుల ఇంటికి వెళ్లలేక బస్ స్టాండ్ కు వెళ్లింది. అమాయకురాలైన అమ్మాయి మీద కన్ను వేసిన కామాంధుడు నీకు సహాయం చేస్తానని ఆమెను నమ్మించాడు. తన వెంట వచ్చిన అమ్మాయిని కోళ్ల ఫామ్ లోని ఓ రూమ్ లో నిర్బంధించాడు.

స్నేహితుడిని కోళ్లఫామ్ దగ్గరకు పిలిపించుకుని మూడుపూటల నాటుకోడికి మేపినట్లు ఆ అమ్మాయికి బిర్యానీలు పెట్టి 22 రోజుల పాటు నిర్బంధించి ఇద్దరూ సామూహిక అత్యాచారం చేశారు. జనసంచారం అతి తక్కువగా ఉండే కోళ్లఫామ్ లో ఇన్ని రోజులు ఒక అమ్మాయి ఎందుకు ఉంది ? అంటూ అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు కథ వెలుగు చూసింది.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

ఇంట్లో ఫైటింగ్

ఇంట్లో ఫైటింగ్

ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలోని తీర్టోల్ ప్రాంతంలో దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఇంట్లో చిన్నచిన్న విషయాల్లో ఆ యువతి తల్లితో గొడవపడుతోంది. 25 రోజుల క్రితం ఇంట్లో తల్లితో చిన్న విషయంలో గొడవపడిన యువతి కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది.

బస్ట్ స్టాండ్ లో కామాంధుడు

బస్ట్ స్టాండ్ లో కామాంధుడు

ఇంట్లో గొడవపడి బస్ స్టాండ్ చేరుకున్న ఆ యువతి బంధువుల ఇంటికి వెళ్లాలా ? వద్దా ? అంటూ ఆలోచిస్తూ ఉంది. ఆ సమయంలో కోళ్లఫామ్ నిర్వహిస్తున్న నాయక్ అనే కామాంధుడు యువతిని గమనించాడు. ఆ యువతి ఏదో ఆందోళనతో ఉందని పసిగట్టిన నాయక్ ఆమె దగ్గరకు వెళ్లి ఎవరు నువ్వు ? ఎందుకు అలా ఉన్నావు ? అంటూ పలకరించాడు.

నేను సర్దిచెబుతాను నాతో రా

నేను సర్దిచెబుతాను నాతో రా

మీ ఇంట్లో నేను సర్దిచెబుతానని, నిన్ను ఏమీ మాట్లాడకుండా నేను చూసుకుంటానని, రెండు రోజులు మా ఇంట్లో ఉంటే అన్నీ సర్దుకుంటాయని ఆ యువతిని నమ్మించిన నాయక్ అతని వెంట తీసుకెళ్లాడు. అమ్మాయిని ఇంటికి పిలుచుకుని వెళ్లకుండా నేరుగా బోగామిల్ గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పౌల్ట్రీఫామ్ (కోళ్లఫామ్) దగ్గరకు పిలుచుకుని వెళ్లాడు.

నాటుకోడి చిక్కిందని రూమ్ లో కట్టేసి రేప్

నాటుకోడి చిక్కిందని రూమ్ లో కట్టేసి రేప్

కోళ్లఫామ్ దగ్గరకు వెళ్లిన యువతికి ఆ రోజు బిర్యానీ తీసుకెళ్లి పెట్టారు. రాత్రి కోళ్లఫామ్ లోని గదిలో ఆ యువతిని నిర్బంధించిన నాయక్ ఆమెపై అత్యాచారం చేశాడు. మూడు రోజుల పాటు యువతి ఆ రూమ్ నుంచి బయటకు రాకుండా చేసి పదేపదే అత్యాచారం చేశాడు. అంతటితో ఆమెను వదిలిపెట్టని కామాంధుడు నాయక్ అతని స్నేహితుడిని కోళ్లఫామ్ దగ్గరకు పిలిపించి అతనితో కలిసి ఆమెపై పదేపదే సామూహిక అత్యాచారం చేశారు. అమ్మాయి ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత ఆమె కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు కుమార్తె కోసం గాలించి చివరికి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

22 రోజులు నరకం

22 రోజులు నరకం

ప్రతిరోజు వెరైటీ వెరైటీ ఫుడ్ తీసుకెళ్లి ఆ యువతితో బలవంతంగా తినిపిస్తున్న ఇద్దరు కామాంధులు 22 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. గ్రామానికి దూరంగా ఉన్న కోళ్లఫామ్ లో ఎవరో యువతి ఉందని గుర్తించిన స్థానికులకు ఇక్కడ ఏదో జరుగుతోంది అంటూ అనుమానం పెరిగిపోయింది. అటు వైపు ఎవ్వరినీ రానివ్వకుండా నాయక్ అటు వైపు వెలుతున్న వారిపై మండిపడటంతో వారికి మరింత అనుమానం ఎక్కువ అయ్యింది వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 పోలీసుల ఎంట్రీతో షాక్

పోలీసుల ఎంట్రీతో షాక్

పోలీసులు అర్దరాత్రి కోళ్లఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో కామాంధుడు నాయక్ తప్పించుకుని పారిపోవడంతో అతని స్నేహితుడు పోలీసులకు చిక్కిపోయాడు. 22 రోజుల పాటు తాను నరకం చూశానని యువతి పోలీసుల ముందు విలపించింది. యువతిని రక్షించిన పోలీసులు ఆమెకు వైద్యపరీక్షలు చేయించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. బాధితురాలికి వెంటనే రూ. 25 లక్షలు నష్టపరిహారం అందివ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.

English summary
Torture: 17 year old girl molested for 22 days by 2 members near Bhubaneswar in Odisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X