నా భర్త అమ్మాయిల పిచ్చోడు, వివాహేతర బంధం, చిత్రహింసలు: మహిళ వేడుకోలు (వీడియో)
Recommended Video

ముంబై: తన భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఓ మహిళ ఓ వీడియో తీసుకుని తన ఆవేదనను చెప్పుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. వ్యాపారవేత్త అయిన తన భర్త.. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నాడని, అతని నుంచి తనకు ప్రాణ హాని ఉందని సదరు మహిళ ఆ వీడియోలో వేడుకుంది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
తన వీడియో సందేశాన్ని ఆమె తన సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ తన ట్విట్టర్‌లో ఆ వీడియోను పోస్టు చేశారు. అంతేగాక, ఆ వీడియోను ఖర్ పోలీస్ స్టేషన్, ముంబై పోలీస్, ముంబైసీపీ, బేటీ బచావో బేటీ పడావోకు తెలియజేసేలా ట్వీట్ చేశారు.

వివాహేతర బంధం, వేధింపులు
కాగా, ఆ వీడియోలో ‘నా భర్త నన్ను హింసిస్తున్నాడు. ఇది ఈ నాటిది కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతోంది. అతనో అమ్మాయిల పిచ్చోడు. జూదగాడు.. అప్పుల పాలయ్యాడు. పైగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ అవలక్షణాల మూలంగానే నేను నా కూతురితో ఆయనకు దూరంగా ఉంటున్నా. అయినా డబ్బు కోసం నన్ను వేధిస్తూ వస్తున్నాడు' అని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ఆస్తి ఇచ్చేయాలంటూ..
అంతేగాక, ‘నా పేరు మీద ఉన్న ఒక్క ఫ్లాట్‌ను తన పేరు మీద రాయాలంటూ వేధిస్తున్నాడు. పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పైగా ఆ స్టేషన్ ఎస్సై నా భర్తతో కుమ్మక్కయ్యాడు. నాకు ప్రాణ హని ఉంది. దయచేసి ఎవరైనా సాయం చెయ్యండి. ఈ కిరాతకుడిని నుంచి నన్ను, నా కూతురిని కాపాడండి' అంటూ ఆ మహిళ ఆ వీడియోలో వేడుకుంది.

వేర్వేరు ఫ్లాట్లలో
ఈ వీడియోపై స్పందించిన ముంబై పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, గుర్‌ప్రీత్ సింగ్ అనే వ్యాపారవేత్త తన భార్య, ముగ్గురు పిల్లలతో ఖర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడని పోలీసులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం భార్య, భర్తలిద్దరికీ మనస్పర్థలు మొదలయ్యాయని, భర్త ప్రవర్తన సరిగ్గా లేకపోవటంతో గొడవలు జరిగి అదే అపార్ట్‌మెంట్‌లో వేర్వేరు ఫ్లాట్‌లలో ఉంటున్నారని చెప్పారు.
దాడి చేశాడు.. చర్యలు తీసుకుంటాం
కూతురుతో తల్లి 12వ ఫ్లోర్లో ఉంటుండగా, మిగిలతిన ఇద్దరు పిల్లలతో భర్త గుర్‌ప్రీత్ 11వ ఫ్లోర్‌లో ఉంటున్నాడని.. ఈ క్రమంలో ఓరోజు భార్య ఉంటున్న ఫ్లాట్‌లో దొంగతనానికి యత్నించిన గుర్‌ప్రీత్, మరోసారి ఏకంగా ఆమెపై దాడి చేశాడని తెలిపారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా అతను మరోసారి ఆమెపై దాడికి తెగబడటంతో ప్రాణ భయంతో ఆమె ఈ వీడియోను పోస్టు చేసి సాయం కోరిందని పోలీసులు తెలిపారు. నిందితుడు గురుప్రీత్‌పై కేసు నమోదు చేశామని, అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications