దారుణం: ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్, వీడియో తీసి బెదిరింపు

పనాజీ: గోవా బీచ్ లో బాయ్ ప్రెండ్‌తో సరదాగా గడుపుదామని వచ్చిన ఓ యువతిపై ముగ్గురు దుండగులు దారుణంగా ప్రవర్తించారు. ప్రియుడి కళ్ళముందే ప్రియురాలిపై ఆ ముగ్గురు నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

లైంగిక దాడులకు పాల్పడకుండా ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకొంటున్నప్పటికీ మృగాళ్ళ దారుణాలు ఆగడం లేదు. ఒంటరిగా దొరికిన ప్రేమ జంటపై గోవాలో ముగ్గురు నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరున్న గోవాలో ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది.ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు గోవా మంత్రి ప్రకటించారు.

బాయ్‌ఫ్రెండ్ ఎదుటే గ్యాంగ్ రేప్

బాయ్‌ఫ్రెండ్ ఎదుటే గ్యాంగ్ రేప్

రాత్రి వేళల్లో గోవా కోల్వా బీచ్ అందాలను చూసేందుకు ఓ ప్రేమ జంట గోవాకు వచ్చింది రాత్రిపూట కోల్వా బీచ్ అందాలను ఆ జంట తిలకిస్తుండగా ముగ్గురు నిందితులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఇండోర్‌కు చెందిన ధనంజయ్‌పాల్, రామ్ సంతోష్ భరియా, విశ్వాస్ మక్రానాలు ఆ జంటను బంధించారు. ఆ తర్వాత ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై ఆ దుండగులు గ్యాంగ్‌రేప్ కు పాల్పడ్డారు.

రేప్‌ను వీడియో తీసి బ్లాక్ మెయిల్

రేప్‌ను వీడియో తీసి బ్లాక్ మెయిల్

ప్రియుడి ముందే ప్రియురాలిని గ్యాంగ్ రేప్ చేసిన దృశ్యాలను ఆ దుండగులు వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటకు చెబితే ఈ వీడియోను నెట్‌లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాదు ఇద్దరిని నగ్నంగా చేసి వేర్వేరుగా వీడియోలు, ఫోటోలు తీశారు. అంతేకాదు వారి వద్ద ఉన్న డబ్బులను కూడ దోచుకొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు.

స్పందించిన మంత్రి విజయ్

స్పందించిన మంత్రి విజయ్

గోవాలో బాయ్ ఫ్రెండ్ ఎదుటే గ్యాంగ్ రేప్ కు గురైన ఘటన గోవా మంత్రి విజయ్ సర్దేశాయ్ స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్పారు. గోవాకు వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని ఆయన చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా విచారణ చేస్తున్నారని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయమై ఆయన స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+