రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి, డ్రైవర్ ను కొట్టి చంపేసిన ప్రజలు !
స్కూల్ నుంచి ఇంటికి వెలుతున్న బాలిక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. విషయం గుర్తించిన స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని అతి దారుణంగా కొట్టి చంపేసిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో జరిగింది.
పశ్చిమ బెంగాల్: స్కూల్ నుంచి ఇంటికి వెలుతున్న బాలిక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. విషయం గుర్తించిన స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని అతి దారుణంగా కొట్టి చంపేసిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో జరిగింది.
మల్డా జిల్లాలోని మోలాద్రీ తులసిరామోట్రా ప్రాంతంలో స్థానిక బాలిక స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో వేగంగా వచ్చిన ట్రాక్టర్ బాలికను ఢీకొనింది. ట్రాక్టర్ చక్రాల కిందపడిన బాలిక సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది.

విషయం గుర్తించిన స్థానికులు ట్రాక్టర్ ను నిలిపి డ్రైవర్ ను పట్టుకుని చితకబాదేశారు. కర్రలు, రాడ్లతో దాడి చెయ్యడంతో డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మరణించాడు. స్థానికులు ట్రాక్టర్ కు నిప్పంటించి రోడ్డు బంద్ చేసి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు నచ్చచెప్పారు.
అయితే వారు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని జిల్లా మెజిస్ట్రేట్ కౌశిక్ బట్టాచటర్జీ మీడియాకు చెప్పారు. స్థానికుల దాడిలో మరణించిన ట్రాక్టర్ డ్రైవర్ వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications