Traffic rules change: వాహనదారులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఛేంజ్.. భారీగా పెరిగిన జరిమానాలు
భారత్ లోని మెట్రో నగరాలైన దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్ కతా లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా వాహనదారులు మాత్రం అలాగే రూల్స్ ను బ్రేక్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే త్వరగా గమ్య స్థానానికి చేరుకోవాలని అడ్డదారిలో ప్రయాణం, రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయని మితిమీరిన వేగంతో బండి నడపడం కారణంగా వందలాది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ ను ఛేంజ్ చేసింది. ఈ మేరకు కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే విషయాలను కర్ణాటక ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ బీ సురేశ్ మీడియాతో వెల్లడించారు. ఎవరైనా హాఫ్ హెల్మెట్ ను వినియోగించినా.. విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రూల్ ను తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు న్యాయ పరమైన అంశాలను వెంటనే విశ్లేషించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
"ఇటీవలికాలంలో హాఫ్ హెల్మెట్ ధరించేవారి సంఖ్య పెరుగుతోంది. హాఫ్ హెల్మెట్ కు చోటు లేదు. ఈ మేరకు వాటిని తయారు చేసే.. వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చాం" అని మంత్రి బీ సురేశ్ వెల్లడించారు. అలాగే పాదచారులు నడిచే ఫుట్ పాత్ లపై బండిని నడిపితే రూ. 5 వేలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఇదే అంశంపై ఆలోచన చేస్తోంది. ఇంతకుముందు ఈ జరిమానా రూ. 500 గా ఉంది. ఇప్పుడు దాన్ని పదింతలు పెంచేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. ఈ మేరకు ఫస్ట్ టైమ్ దొరికిన వారికి రూ. 5 వేలు జరిమానా ఉంటుంది. రెండోసారి కూడా ఇలాగే చేస్తే రూ. 10,000 వేలు చెల్లించాల్సిందేనని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ మార్పుపై ఇప్పటికే ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్, హోమ్ డిపార్ట్ మెంట్ లు ప్రొపోజల్స్ ను సబ్మిట్ చేశాయని ఇక లా డిపార్ట్ మెంట్ చివరి నిర్ణయం తీసుకున్నాక రూల్స్ అమల్లోకి వస్తాయన్నారు.

ఇక వన్ వే లో ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసినవారికి ఇప్పుడున్న జరిమానాకు పదింతలు అంటే ఇప్పుడున్న రూ. 1000 కు రూ. 10,000 జరిమానా విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ట్రాఫిక్ రూల్స్ ను అధిగమించేవారిని కంట్రోల్ చేసి.. వాహనదారులు ఈ రూల్స్ ను ఫాలో అయ్యేందుకే ఫైన్స్ ను పెంచినట్లు కర్ణాటక ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ బీ సురేశ్ మీడియాతో వెల్లడించారు.












Click it and Unblock the Notifications
