విలన్ కు ముందు బీడాలు వేస్తూ సిక్స్ ప్యాక్ చేసి, నిర్మాతగా

బెంగళూరు: శ్యాండిల్ వుడ్ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే తమ సత్తా చాటుకుని పైకి వస్తున్న అనీల్ కుమార్ అలియాస్ అనీల్, ఉదయ్ అనే ఇద్దరు యువకులు సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలోనే జలసమాధి అయ్యారు.

మాస్తిగుడి సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా తాము సిద్దంగా ఉన్నామని అనీల్, ఉదయ్ చనిపోక ముందు మీడియాకు చెప్పారు. అయితే అదే వారి చివరి మాటలు అని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు.

జన్మనిచ్చిన గురువు

జన్మనిచ్చిన గురువు

తాము గురువుగా భావించే మాస్తిగూడి సినిమా హీరో దునియా విజయ్ కి హెలికాప్టర్ నుంచి కిందకు దూకే ముందు అనీల్, ఉదయ్ ఇద్దరూ ఆయన పాదాలకు నమస్కరించి కిందకు దూకి జలసమాధి అయ్యారు. తమకు సినీరంగంలో జన్మనిచ్చిన గురువు దునియా విజయ్ కు ఈ విధంగా రుణం తీర్చుకుని దేవుడి దగ్గరకు వెళ్లిపోయారని వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

ఇద్దరికి టర్నింగ్ పాయింట్

ఇద్దరికి టర్నింగ్ పాయింట్

ఇప్పటి వరకు కన్నడ సినిమా రంగంలో అనీల్, ఉదయ్ చిన్నచిన్న పాత్రలు చేసుకుంటు వచ్చారు. అయితే మొదటి సారి మెయిన్ విలన్లుగా మాస్తిగుడి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల అయిన తరువాత మీరిద్దరూ బిజీ అయిపోతారని అందరూ చెప్పేవారు. అయితే పరిస్థితి తారుమారైయ్యింది.

పేద కుటుంబం

పేద కుటుంబం

బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉంటున్న వేణుగోపాల్, సరస్వతి దంపతుల మూడో కుమారుడు అనీల్. అనీల్ కు ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అనీల్ భ్రమ్య అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉంది.

బీడా అంగడి, జిమ్ ట్రైనర్

బీడా అంగడి, జిమ్ ట్రైనర్

అనీల్ సినిమా రంగంలోకి అడుగు పెట్టకముందు జిమ్ ట్రైనర్ గా పని చేశాడు. అదే సమయంలో బీడా అంగడిలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. తరువాత రోజుకు రూ. 800కు టర్నర్ గా పని చేశాడు. తరువాత సక్రమంగా లోన్ కట్టని వారి వాహనాలు సీజ్ చేసే ఉద్యోగంలో చేరాడు.

కాలం కలిసి వచ్చే సమయంలో

కాలం కలిసి వచ్చే సమయంలో

వాహనాలు సీజ్ చేస్తున్న సమయంలో ఫైటర్లతో అనీల్ కుమార్ కు పరిచయం అయ్యింది. తరువాత బెంగళూరులోని కృష్ణారావ్ పార్క్ సమీపంలో ఫైటర్ గా శిక్షణ తీసుకోవడానికి వెళ్లిన సమయంలో దునియా విజయ్ అనీల్ కు పరిచయం అయ్యాడు.

క్రమశిక్షణతో ఈ స్థాయికి వచ్చాడు

క్రమశిక్షణతో ఈ స్థాయికి వచ్చాడు

దునియా విజయ్ పరిచయం అయిన తరువాత అనీల్ కుమార్ సుడి తిరిగింది. దునియా విజయ్ నటించిన మొదటి సినిమా దునియా నుంచి ఇప్పటి వరకు ఆయన హీరోగా నటించిన ప్రతి సినిమాలో అనీల్ నటిస్తూ వచ్చాడు. అనుకోకుండా శ్యాండిల్ వుడ్ లో అడుగు పెట్టిన అనీల్ ఇప్పటి వరకు 25 కన్నడ సినిమాల్లో నటించాడు.

 తక్కువ కాలంలో గురువుతో సినిమా

తక్కువ కాలంలో గురువుతో సినిమా

తనకు సినిమా రంగంలో అవకాశం ఇచ్చిన దునియా విజయ్ హీరోగా అనీల్ తన స్నేహితుడు సుందర్ తో కలిసి జాక్సన్ అనే సినిమాను నిర్మించారు. తన అభిమానులు తీస్తున్న సినిమాలో హీరోగా నటించిన దునియా విజయ్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ సినిమాలో నటించి అభిమానులు పైకి రావాలని ఆశిర్వధించారు.

ఆ కష్టానికి ఫలితం

ఆ కష్టానికి ఫలితం

బీడాలు వేసుకుని అనీల్ చివరికి జిమ్ కోచ్ గా పని చేశారు. తరువాత సినీరంగంలో అడుగు పెట్టిన తరువాత తన శరీరాన్ని రాయి చేసుకున్నారు. మాస్తిగుడి సినిమా కోసం దునియా విజయ్ జిమ్ కోచ్ పానీపూరి కిట్టి దగ్గర 10 నెలల నుంచి రోజుకు 7 గంటల పాటు వ్యాయామం చేశాడు. మాస్తిగుడి సినిమా కోసం సిక్స్ ప్యా చేసి నటించాడు.

పరుగు తీసిన నిర్మాతలు

పరుగు తీసిన నిర్మాతలు

మాస్గిగుడి సినిమాలో అనీల్ గెటప్, ఆయన శరీరాన్ని చూసిన నిర్మాతలు, దర్శకులు శ్యాండిల్ వుడ్ కు మంచి విలన్ చిక్కాడని సంతోషించారు. అనీల్ ను తమ సినిమాల్లో నటించడానికి అవకాశం కల్పించారు.

శ్యాండిల్ వుడ్ నెంబర్ వన్ విలన్ అయ్యే చాన్స్

శ్యాండిల్ వుడ్ నెంబర్ వన్ విలన్ అయ్యే చాన్స్

శ్యాండిల్ వుడ్ లో మంచి విలన్ (యువకుడు) ఎక్కడ చూసిన కనపడటం లేని సమయంలో అనీల్ దర్శక నిర్మాతల కళ్లలో పడ్డాడు. అనీల్ నీకు మంచి భవిష్యత్తు ఉందని అందరు అంటున్న సమయంలో యుమరాయుడు ఈ విధంగా అతన్ని పైలోకాలకు తీసుకు వెళ్లి పోయారు.

రాకింగ్ స్టార్ యష్

రాకింగ్ స్టార్ యష్

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన మాస్టర్ పీస్, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి, సంతు స్టెయిల్ ఫార్వడ్ అనే సినిమాల్లో నటించాడు. అనేక సినిమాల్లో అనీల్ నటించవలిసి ఉంది.

ఈగ ఫేం సుదీప్ అవకాశం ఇచ్చాడు

ఈగ ఫేం సుదీప్ అవకాశం ఇచ్చాడు

మాస్తిగూడి సినిమా పూర్తి అయిన తరువాత అనీల్ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ నటిస్తున్న రాజకుమార సినిమాలో, ఈగ ఫేం సుదీప్ నటిస్తున్న హుబ్బళి సినిమాలో నటించవలసి ఉంది. ఇప్పటికే అనీల్ ఆ రెండు సినిమాలకు సంతకం చేశారు. అనేక సినిమాలు అనీల్ చేతిలో ఉన్నాయి. అయితే విధి ఆడిననాటకంలో అనీల్ పరలోకాలకు వెళ్లిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+