లేడీ డ్యాన్సర్ ను గ్యాంగ్ రేప్ చేసే యత్నం.. 10 కి.మీ వెంటాడి.. చివరికి..
బెంగాల్ లోని కోల్ కతాలో షాకింగ్ ఘటన జరిగింది. కామాంధుల వికృత చేష్టలకు ఓ లేడీ డ్యాన్సర్ బలి అయింది. 10 కిలోమీటర్ల పాటు ఆమె ప్రయాణిస్తున్న కారును వెంబడించారు దుండగులు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందింది. ఆమె ఫ్రెండ్స్ కు తీవ్ర గాయాలయ్యాయి.
ఏం జరిగింది..?
బెంగాల్ హూగ్లీ జిల్లాలోని చందర్ నగర్ కు చెందిన లేడీ డ్యాన్సర్, ఈవెంట్ మేనేజర్ పై కొందరు ఆకతాయిలు మద్యం సేవించి విరుచుకుపడ్డారు. ఆమె తన తోటి ఉద్యోగులతో కలిసి ఆదివారం అర్ధరాత్రి తర్వాత బిహార్ లోని గయాకు వెళ్తుండగా.. ఆమెను కొంతమంది దుండగులు చూశారు. మద్యం మత్తులో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె ప్రయాణిస్తున్న కారును వెంబడించారు.

దుండగులు కారులో గట్టిగా కేకలు వేస్తూ.. బూతులు తిడుతూ ఛటోపాధ్యాయను ఛేజ్ చేశారు. ఇది గమనించిన డ్రైవర్ స్పీడ్ పెంచాడు. వాళ్లు కూడా వేగం పెంచారు. వాళ్లను తప్పించుకునే క్రమంలో డ్రైవర్ కారు వేగాన్ని మరింత పెంచాడు. వాళ్లు కూడా అదే వేగంతో వచ్చి కారును ఢీ కొట్టారు. ఈ క్రమంలో కారులోని సుతాంద్రా ఛటోపాధ్యాయ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఛటోపాధ్యాయ డ్రైవర్ రాజేడియో శర్మ ఇచ్చిన స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications