Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో.. యువకుడి ప్రాణం తీసిన యూట్యూబ్.. ఎలాగో తెలిస్తే షాక్..!

ప్రస్తుతం జీవనశైలి, ఆహార శైలి మారిపోయింది. ఇప్పుడు యువతలో అధిక బరువు, ఊబకాయం పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం యువత జిమ్ లు, డైట్ ల వెంట పరుగెడుతున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ లు చూసి స్వంతంగా కీటో డైట్ లాంటివి పాటిస్తున్నారు. అయితే తాజాగా యూట్యూబ్ లో డైట్ ఫాలో అయి ఓ యువకుడు మృతి చెందాడు. బరువు తగ్గాలన్న ఆశతో ఆ యువకుడు మూడు నెలలుగా ఆహారం మానేసి కేవలం ఫ్రూట్ జ్యూస్ ల మీదే ఆధారపడ్డాడు. దీంతో అతడు స్పృహ తప్పి పడిపోయి మృతి చెందాడు. కన్యాకుమారిలో ఈ ఘటన జరిగింది.

యూట్యూబ్ చూసి డైటింగ్ మొదలు పెట్టాడు. బరువు తగ్గాలని డేంజరస్ నిర్ణయం తీసుకున్నాడు. మూడు నెలలుగా కేవలం పండ్ల రసం మాత్రమే తాగాడు. తాజాగా స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆ యవకుడ్ని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కన్యాకుమారిలోని బర్నత్విలైకి ప్రాంతానికి చెందిన శక్తిశ్వర్(17) ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ లో చేరేందుకు సిద్దమవుతున్నాడు. అయితే శక్తిశ్వర్ లావుగా ఉన్న నేపథ్యంలో కాలేజీలో తోటి విద్యార్థులు నవ్వుతారని భావించి బరువు తగ్గాలని అనుకున్నాడు. అలా యూట్యూబ్ చూసి డైటింగ్ స్టార్ట్ చేశారు.

Tragic Loss Kanyakumari Youth Shaktiswar Dies Following YouTube Diet

యూట్యూబ్‌ లో చెప్పిన ప్రకారం డైట్, వ్యాయామం చేయడం ప్రారంభించాడు. ఆ యూట్యాబ్ లో చెప్పిన ప్రకారం.. గత మూడు నెలలుగా ఇతర ఆహార పదార్థాలు తినడం మానేసి.. కేవలం ఫ్రూట్‌ జ్యూస్‌ మాత్రమే తాగుతూ శక్తిశ్వర్ వ్యాయామం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి జలుబుతో పాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఇంతలోనే స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రృవీకరించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. యూట్యూబ్ లో చెప్పిన డైట్ కారణంగా మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఘటనపై కేసు నమోదు చేసి అతని తల్లిదండ్రుల సహాయంతో విద్యార్థి మరణంపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+