చిన్న పిల్లల ఆసుపత్రి బుగ్గి- పసికందులను పొట్టనబెట్టుకున్న అగ్నికీలలు
మహారాష్ట్ర అమరావతి జిల్లా ఆసుపత్రిలో ఈ వేకువజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక్కడి నియోనాటల్ ఐసీయూలో సంభవించిన ఈ ఘటనలో ముగ్గురు పసికందులు సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఆసుపత్రి మూడో అంతస్తులో ఉన్న ఉందీ నియోనాటల్ ఐసీయూ వార్డ్. ఈ వేకువజామున సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఈ భారీ ప్రమాదం జరిగింది. వార్డులోని ఓ వెంటిలేటర్ అకస్మాత్తుగా పేలిపోవడమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ వెంటిలేటర్ పేలిందా లేదా సాంకేతిక లోపం ఉందా అనే పూర్తిస్థాయి వివరాలు దర్యాప్తు నివేదిక తర్వాతే వెల్లడి కానున్నాయి.

ప్రమాద సమయంలో ఆ అత్యవసర చికిత్సా విభాగంలో దాదాపు 39 మంది నవజాత శిశువులు వేర్వేరు రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడమే కాకుండా దట్టమైన విషపూరిత పొగ వార్డు మొత్తాన్నీ కమ్ముకోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి. అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర సహాయక సిబ్బంది చిన్నారులను ఇతర వార్డులకు తరలించారు.
అయినప్పటికీ ముగ్గురు పసిబిడ్డలు మంటల్లో చిక్కుకుని మరణించడం అందరినీ కలచివేసింది. మరో ఆరుగురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో, వారిని వైద్య చికిత్స కోసం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్, విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
అప్పుడే పుట్టిన తమ పసిబిడ్డలను విగతజీవులుగా చూసి తట్టుకోలేక గుండె పగిలేలా రోదిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై జిల్లా అధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఎన్‌ఐసీయూలోని విద్యుత్ సరఫరా వ్యవస్థతో పాటు అక్కడ అమర్చిన లైఫ్ సపోర్ట్ వైద్య పరికరాల సర్వీసింగ్ వివరాలను తనిఖీ చేస్తోన్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించడానికి ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.
#WATCH | Amravati, Maharashtra: Three newborn babies lost their lives after a fire broke out in the Neonatal Intensive Care Unit (NICU) of the District Women’s Hospital. According to preliminary information, the fire erupted at around 3.30 am on the third floor of the hospital,… pic.twitter.com/fhSQvykujw
— ANI (@ANI) August 24, 2026













Click it and Unblock the Notifications