జియో ‘న్యూ ఇయర్ ఆఫర్’కు ట్రాయ్ క్లీన్ చిట్, మార్చి 31 వరకు నో ప్రాబ్లం
టారిప్ వార్ లో రిలయన్స్ జియో విజయం సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను ఈ ఏడాది మార్చి 31 వరకు నిరభ్యంతరంగా విని
ముంబై: టారిప్ వార్ లో రిలయన్స్ జియో విజయం సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది. రిలయన్స్ జియో ప్రకటించిన ఫ్రీ టారిఫ్ ఆఫర్లు జీవిత కాలం ఇవ్వడం సాధ్యం కాదని వాదించిన మిగతా టెలికాం కంపెనీలకు ఇది షాక్ లాంటిదే.
జియో ప్రకటించిన వెల్ కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్.. రెండూ వేర్వేరు అని ట్రాయ్ తేల్చిచెప్పింది. రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లలో ఎలాంటి తప్పులు దొర్లలేదని గతంలో కూడా ట్రాయ్ ప్రకటించింది. ఇప్పుడు కూడా జియో టారిఫ్ ఆఫర్లకు క్లీన్ చిట్ ఇస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది.

రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకాం హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పై టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, ఐడియా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ముఖ్యంగా భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ రిలయన్స్ జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా జీవిత కాలం ఫ్రీగా ఇవ్వడం సాధ్యం కాదని, రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్లను నిరోధించాలంటూ ఈ విషయంలో టెలికాం ట్రిబ్యునల్ (టిడి శాట్)ను కూడా ఆశ్రయించారు.
ఇప్పుడు రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కు కూడా ట్రాయ్ క్లీన్ చిట్ ఇచ్చేయడంతో రిలయన్స్ జియో ఊపిరి పీల్చుకుంది. దీంతో ఈ ఏడాది మార్చి 31 వరకు జియో ఆఫర్ చేసిన ఉచిత డేటా, వాయిస్ సేవలను జియో వినియోగదారులు నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు.












Click it and Unblock the Notifications