కేరళ విలయం: 125కి చేరిన మృతుల సంఖ్య

కేరళ రాష్ట్రంలోని వయనాడ్​‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 125 మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వందల మంది గాయపడినట్లు రెవెన్యూ మంత్రి కార్యాలయం పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ప్రధాన కార్యదర్శి వేణు వివరించారు.

ఘటనా స్థలంలో కేరళ రాష్ట్ర విపత్తు స్పందన దళం, అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీ కలిసి రెస్క్యూ ఆపరేషన్‌​ను కొనసాగిసున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని తెలుస్తోంది.

Trail Of Destruction In Wayanad Death Toll Rises To 125

మృతదేహాలు వెలికితీయడంతో వారిని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం నేపథ్యంలో మంగళ, బుధవారాలను సంతాప దినాలుగా ప్రకటించింది కేరళ ప్రభుత్వం. మరోవైపు, బాధితులకు అందుతున్న వైద్య సేవలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్​ సమీక్షించారు.

వంద మందికిపైగా ప్రజలు మరణించడంతో వయనాడ్​ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. బాధిత కుటంబాలకు సత్వరం సాయం అందజేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. వీలైతే పరిహారాన్ని మరింత పెంచాలని కోరారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయాన్ని అందించాలని లోక్‌సభలో రాహుల్ పేర్కొన్నారు. వయనాడ్‌లో పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.


మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కేరళ సీఎం పినరయి విజయన్​ కు ఫోన్​ చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి అవసరమైన పూర్తి సాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వం సైన్యం సాయం కోరింది. దీంతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడి 122 ఇన్ ఫాంట్రీ బెటాలియన్‌​కు చెందిన రెండు బృందాలను కేరళకు పంపారు.

బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించారు. రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మొత్తం 225 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 118 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+