ట్రైన్ ఆలస్యానికి రూ. 9 లక్షల జరిమానా
ఒక రైలు ఆలస్యమైంది.. అది ఓ విద్యార్థిని జీవితాన్ని మలుపు తిప్పింది. ఏడాది పాటు కష్టపడి చదివిన ఆమె తన పరీక్షను ఫెయిల్ అయింది. కానీ ఓటమితో ఆగలేదు... ఏడేళ్ల పాటు న్యాయపోరాటం చేసింది. చివరికి, రైల్వేలే తప్పు చేశాయని కోర్టు తేల్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్థిని కథ ఇది. రైలు ఆలస్యాల వల్ల దేశవ్యాప్తంగా లక్షల మంది ఇబ్బంది పడుతున్నా, దానికి బాధ్యత ఎవరూ తీసుకోని పరిస్థితుల్లో... ఈ కేసు ప్రత్యేకంగా నిలిచింది.
2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష రాయాలన్నది సమృద్ధి కల. ఏడాది పాటు పగలూ, రాత్రీ కష్టపడి సన్నద్ధమైంది. పరీక్షా కేంద్రం లక్నోలోని జై నారాయణ్ పీజీ కళాశాల. పరీక్ష రోజున ఆమె బస్తీ నుంచి ఉదయం బయల్దేరింది. అంతర్-నగర సూపర్‌ఫాస్ట్ రైలు ఉదయం 11 గంటలకు లక్నో చేరాల్సి ఉంది. కానీ రైలు షెడ్యూల్ ప్రకారం రాలేదు. గంట... గంటన్నర... రెండున్నర గంటల ఆలస్యం. పరీక్షా కేంద్రానికి మధ్యాహ్నం 12:30 గంటలలోపు హాజరు కావాల్సి ఉండగా, రైలు మాత్రం చాలా ఆలస్యంగా లక్నో చేరింది. అప్పటికే గేట్లు మూసేశారు. సమృద్ధి కళ్ల ముందే ఆమె కల చెదిరిపోయింది.

రైల్వేల నిర్లక్ష్యం.. భవిష్యత్తు నాశనం..
ఈ ఒక్క ఆలస్యం వల్ల ఆమె పూర్తి విద్యా సంవత్సరం కోల్పోయింది. నిశ్శబ్దంగా బాధపడటం కంటే, తప్పు చేసినవారిని ప్రశ్నించాలని సమృద్ధి నిర్ణయించుకుంది. రైల్వేల నిర్లక్ష్యమే తన భవిష్యత్తును దెబ్బతీసిందంటూ రూ.20 లక్షల పరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో దావా వేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ, జనరల్ మేనేజర్, స్టేషన్ సూపరింటెండెంట్‌లకు నోటీసులు పంపినా సరైన స్పందన రాలేదు. కేసు ఏడేళ్లకు పైగా సాగింది. విచారణలో రైల్వేలు రైలు ఆలస్యాన్ని అంగీకరించాయి. కానీ ఆలస్యం ఎందుకు జరిగిందో సరైన కారణాలు చెప్పలేకపోయాయి.
రూ.9.10 లక్షల పరిహారం..
ఇరుపక్షాల వాదనలు విన్న జిల్లా వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. రైల్వేలు సకాలంలో సేవలు అందించడంలో విఫలమయ్యాయని, దాని వల్ల ఒక విద్యార్థిని భవిష్యత్తు నష్టపోయిందని స్పష్టం చేసింది. ఫలితంగా, రైల్వేలు సమృద్ధికి రూ.9.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 45 రోజులలోపు పరిహారం చెల్లించకపోతే 12 శాతం వడ్డీ అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కూడా కమిషన్ హెచ్చరించింది.
"రైలు ఆలస్యం వల్ల ఆమె పరీక్ష రాయలేకపోయింది. ఇది కేవలం ఒక ఆలస్యం కాదు... ఒక యువతి జీవితాన్ని వెనక్కి నెట్టిన ఘటన. రైల్వేలు తప్పును అంగీకరించినా.. సమర్థించుకోలేకపోవడమే ఈ తీర్పుకు దారి తీసింది - సమృద్ధి తరపు న్యాయవాది ప్రభాకర్ మిశ్రా
దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న రైలు ఆలస్యాల సమస్యపై రైల్వేల జవాబుదారీతనాన్ని ప్రశ్నించిన తీర్పుగా నిలిచింది. రైలు ఆలస్యం అనేది సాధారణ విషయం కాదని, దానికి మూల్యం చెల్లించాల్సిందేనని ఈ కేసు స్పష్టంగా చూపించింది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications