పట్టాలు తప్పిన రైలు .. బోగీల్లో చెలరేగిన మంటలు, ఇద్దరు మృతి ?
భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాయగఢ్ కోరాపుట్ మార్గంలో సామలేశ్వరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే రైలు ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇద్దరు మృతి ..
హాప్ డా నుంచి జగదల్‌పూర్ వెళ్తున్న రైలు కెవుటాగూడ వద్ద ప్రమాదానికి గురైంది. రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. దీంతో వెనుక ఉన్న రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. అయితే బోగీల్లో ఉన్న ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఇద్దరు మృతిచెందినట్టు తెలుస్తోంది. మిగతావారికి గాయాలయ్యాయని .. వారిని సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కెవుటాగూడ వద్ద రైలు నుంచి మంటలు రావడంతో సమీపంలోని ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. రైలులో ఉన్న ప్రయాణికులకు సహాయక చర్యలు అందించేందుకు విశాఖపట్టణం నుంచి రిలీఫ్ వ్యాన్ వెళ్లింది. వ్యాన్‌లో 12 మంది వైద్యులు, రైల్వే అధికారులు ఉన్నారు.

చెలరేగిన మంటలు ...
రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. వెనుక ఉన్న బోగీలు మంటలు చెలరేగడానికి కారణమెంటో తెలియరాలేదు. బోగీలు రాపిడికి గురై మంటలు వ్యాపించాయా ? మరేదైనా కారణం ఉందా అనే అంశంపై క్లారిటీ రాలేదు. రైలు ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని .. ఎంక్వైరీ ఆధారంగా నిజ నిజాలు తెలుస్తాయని రైల్వే అధికారులు స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications